పుష్ప మోడల్ పాటించనున్న రాకా?

భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్ క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా సినిమాల్లో అల్లు అర్జున్ ‘రాకా’ టాప్ 3లో ఉంది. బడ్జెట్ ఎంతో బయటికి చెప్పడం లేదు కానీ ఆరు వందల కోట్లకు పైమాటేనని ఇన్ సైడ్ టాక్. అయితే ఇంత మొత్తం రికవరీ కావాలంటే దానికి రెట్టింపు గ్రాస్ రావాలి. ఒక్క భాగమే అయితే బ్రేక్ ఈవెన్ లో ఇబ్బందులు వస్తాయి కానీ అదే సీక్వెల్ మోడల్ లో వెళ్తే లాభాలు కళ్లజూడవచ్చు. కెజిఎఫ్, పుష్ప, బాహుబలి, కాంతార విషయంలో ఇది వసూళ్ల సాక్షిగా రుజువయ్యింది.

ఇప్పుడు రాకాని కూడా టూ పార్ట్ మోడల్ కి తేవాలని దర్శకుడు అట్లీ ఫిక్స్ అయ్యాడని యూనిట్ టాక్. ఎలాగూ లోకేష్ కనగరాజ్ సినిమా ఎంత లేదన్నా రిలీజ్ కావడానికి రెండేళ్లు పడుతుంది. ఈలోగా ఫ్యాన్స్ నిరాశ చెందకుండా రాకాని ఏడాదికో భాగం రిలీజ్ చేస్తే బాగుంటుందని, పలు చర్చల తర్వాత తీర్మానించుకున్నారని ఇన్ సైడ్ న్యూస్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ ఏడాది క్రిస్మస్ లోగా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.

అసలు సమస్య వేరే ఉంది. రాకా రిలీజ్ డేట్ ఇంకా లాక్ చేయలేదు. 2027 మొదటి నాలుగు నెలలు సంక్రాంతి సినిమాలు ఆ తర్వాత వారణాసి, స్పిరిట్ ఆక్రమించుకున్నాయి. వేసవిలో డ్రాగన్ లాంటివి వస్తాయి. సో రాకాని ఎప్పుడు దింపాలనేది ఈ సమీకరణాలు అన్నీ చెక్ చేసుకుని డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ బన్నీ ఫలానా టైంలో వస్తున్నాడని తెలిస్తే ఇతర నిర్మాతలు దానికి తగ్గట్టు వేరే ఆప్షన్లు చూసుకుంటారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కు ఎంత టైం పడుతుందనేదే పెద్ద ప్రశ్న

పర్ఫెక్షన్ కోసం పాకులాడే అట్లీ అంత ఈజీగా డేట్ డిసైడ్ చేయడం కష్టమే అనిపిస్తోంది. పైగా ప్రమోషన్లకు విడిగా సమయం కేటాయించాలి. రాకాకు ఇంటర్నేషనల్ స్టూడియోస్ పని చేయడంతో రాజమౌళి వారణాసిని మ్యాచ్ చేయడమో లేదా దాన్ని దాటే స్థాయిలో కంటెంట్ ఇవ్వడమో అట్లీ చేస్తాడని బన్నీ ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. జక్కన్న లాగే ఇప్పటిదాకా ఫెయిల్యూర్ అన్నదే తెలియకుండా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అట్లీ ఇప్పుడీ రాకాతో ఇంకెంత రచ్చ చేయబోతున్నారో.