ఇప్పుడు ఫ్యానిజానికి అర్థమే మారిపోయింది. తమ అభిమాన కథానాయకుడి మీద ప్రేమ చూపించడం కంటే.. ఆ హీరోకు పోటీగా ఉన్న కథానాయకుడి మీద ద్వేషం చూపించడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో అదే పనిగా ఫ్యాన్ వార్స్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు అభిమానులు. ఈ విషయంలో ఏ హీరో అభిమానులూ మినహాయింపు కాదు.
ఇలాంటి ఫ్యాన్స్ అందరికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక హితబోధ చేసే ప్రయత్నం చేశాడు. తన డైహార్డ్ ఫ్యాన్స్‌తో జరిగిన ఫొటో షూట్ కార్యక్రమంలో బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏ హీరో అభిమాని అయినా నచ్చకపోతే వదిలేయాలని, అంతే తప్ప ద్వేషం చూపించకూడదని అతను హితవు పలికాడు.
నీకు ఎవరు అయినా నచ్చలేదా.. నువ్వు అతణ్ని ద్వేషించి, అతణ్ని ట్రోల్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నీకు నచ్చని వ్యక్తి మీద వన్ పర్సంట్ కూడా నీ సమయం వేస్ట్ చేయొద్దు. నీ దగ్గర వంద రూపాయలు ఉంటే.. నీకు నచ్చని విషయం మీద ఆ వంద ఖర్చు పెడతావా? అలాగే నీకు నచ్చని వ్యక్తి మీద టైం వేస్ట్ చేసుకోకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు ఇష్టమైన అమ్మాయి ఇంటి ముందు వెళ్లి వెయిట్ చేయి తప్ప ఇలాంటివి అవసరం లేదు. నేను నా అభిమానులకే కాదు, నా యాంటీ ఫ్యాన్స్, ట్రోల్ చేసేవాళ్లకు చెప్పేది ఇదే అంటూ కుండబద్దలు కొట్టాడు బన్నీ.
మరోవైపు తన మిత్రుడు, నిర్మాత బన్నీ వాసు గురించి అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాసు తన పేరు ముందు బన్నీ అని పెట్టుకున్నాడని.. ఇలా ఎవరైనా పెట్టుకుంటారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తన మీద అతడికి అంత ప్రేమ అని అన్నాడు. ఐతే ఇక నుంచి బన్నీ పేరు తీసేసి వాసు అనే పేరులోనే తన నేమ్ కూడా కలిసి వచ్చేలా vAAsu అని పెట్టుకోవాలని అల్లు అర్జున్ సూచించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
