Movie News

లెనిన్ జేబులో వంద కోట్లు పడతాయా

అక్కినేని అఖిల్ కు బలమైన కంబ్యాక్ గా నిలిచిన లెనిన్ థియేటర్ రన్ ఇంకా కొనసాగుతోంది. అయితే చెన్నై లవ్ స్టోరీకి వచ్చిన పాజిటివ్ టాక్ తో పాటు అంతకు ముందు ఒడిస్సి క్రేజ్ అయ్యగారి వసూళ్ల మీద తీవ్ర ప్రభావం చూపించింది. తక్కువ స్క్రీన్లు ఉన్న చాలా సెంటర్లలో అఖిల్ షోలను వేరే వాటికి సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అలాని ఆక్యుపెన్సీలు తీవ్రంగా పడిపోయాయా అంటే అదీ లేదు. మొన్న ఆదివారం కూడా డీసెంట్ నెంబర్లు పడ్డాయి. అయినా సరే పరిస్థితి అలా మారిపోయింది.

నిర్మాత నాగవంశీ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఎలాగైనా లెనిన్ ని వంద కోట్ల క్లబ్బులో చేర్చమని ప్రేక్షకులకు పిలుపు ఇచ్చారు. అదేదో బాధ్యతగా నొక్కి చెప్పారు. కానీ ప్రతి వారం కొత్త ఆప్షన్లు వచ్చేయడంతో ఆడియన్స్ నిర్ణయాలు మారిపోయాయి. సితార ఎంటర్ టైన్మెంట్స్ అధికారికంగా జూలై 20న వేసిన లెనిన్ ట్వీట్ లో వరల్డ్ వైడ్ గ్రాస్ 88 కోట్లుగా పేర్కొంది. అంటే ఇప్పుడీ ఎనిమిది రోజుల్లో పన్నెండు కోట్లు రావడం జరగని పని. ఇంకో వీకెండ్ మీద ఆశలు పెట్టుకుని వేచి చూడాలి.

అసలైన ముప్పు మరొకటి ఉంది. జూలై 30 స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే దిగుతున్నాడు. క్రేజ్ మాములుగా లేదు. జిల్లా కేంద్రాల్లో సైతం ఫస్ట్ డే టికెట్లు అడ్వాన్స్ గా అమ్ముడుపోతున్నాయి. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో చెప్పనవసరం లేదు. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే పిల్లా పెద్దా అందరూ దీన్ని చూసేందుకు ఎగబడతారు. అప్పుడు లెనిన్ కే కాదు చెన్నై లవ్ స్టోరీకి కూడా ఇబ్బంది తప్పదు. పైగా స్పైడర్ మ్యాన్ తో ఈసారి హల్క్ తోడవ్వడం అంచనాలు పెంచుతోంది.

లెనిన్ ఫైనల్ థియేటర్ రన్ అయ్యేలోపు వంద కోట్ల పోస్టర్ పడుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. నిజంగా అవుతుందా లేక టాలీవుడ్ లో రెగ్యులర్ గా నడిచే ట్రెండ్ ప్రకారం కలిపి వేసేస్తారా అనేది ఇప్పుడే చెప్పలేం. నిజంగా వస్తే సంతోషమే. లెక్కల సంగతి పక్కనపెడితే లెనిన్ జెన్యూన్ గా హిట్టయిన మాట నిజం. ఇకపై అఖిల్ మరింత జాగ్రత్తగా కథలను ఎంచుకునే ఆలోచనని కూడా ప్రేరేపించింది. నెక్స్ట్ ఎవరితో ఏ బ్యానర్ లో చేస్తాడనేది ఐనా సస్పెన్స్ గానే ఉంది. 

This post was last modified on July 28, 2026 4:54 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

19 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

19 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago