Movie News

మనసు మార్చుకుంటున్న బాలయ్య 111

ఫౌజీ విడుదల డిసెంబర్ 3 అధికారికంగా ప్రకటించాక ఇతర సినిమాల నిర్మాతలు అలెర్ట్ అయ్యారు. ఆ స్లాట్ లో రావాలని ప్లాన్ చేసుకున్న దర్శకులు ఇప్పుడు కొత్త ఆప్షన్లు చూస్తున్నారు. వాటిలో బాలయ్య 111 ప్రధానమైంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వీలైనంత ఫాస్ట్ గా పూర్తి చేసి దసరాకు గుమ్మడికాయ కొట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే విడుదల తేదీ విషయంలో జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వస్తున్నట్టుగా వినిపిస్తోంది.

ప్రస్తుతం ఈ టీమ్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది క్రిస్మస్. షారుఖ్ ఖాన్ కింగ్ అదే టైంలో ఉంది కానీ తెలుగు మార్కెట్ల వరకు టెన్షన్ పడాల్సిన పని లేదు. బాలయ్యది ఎలాగూ ప్యాన్ ఇండియా రిలీజ్ కాదు కాబట్టి ఏపీ, తెలంగాణ, కర్ణాటక జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సంక్రాంతి పండగ దాకా గ్యారెంటీ రెండు వారాల థియేటర్ రన్ దొరుకుతుంది. గరిష్ట వసూళ్లు ఈలోగా రాబట్టేయొచ్చు. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే కొన్ని స్క్రీన్లు ఎలాగూ కంటిన్యూ అవుతాయి.

లేదూ అనుకుంటే బాలయ్య పండగ సెంటిమెంట్ ఫాలో అయిపోయి సంక్రాంతి బరిలో దిగాలి. కానీ కాంపిటీషన్ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి. ఎవరో ఒకరు ఎక్కువ లాభపడతారు. మిగిలిన వాళ్ళు సర్దుకోవాలి. బాలయ్య, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున నలుగురు ఒకేసారి తలపడితే బయ్యర్లను కూడా లేనిపోని ఇబ్బంది. అందుకే సలార్ తరహాలో చక్కగా డిసెంబర్ మూడో వారంలో వచ్చేస్తే సోలో రిలీజ్ తో పాటు ఎక్కువ కలెక్షన్లను ఖాతాలో వేసుకొచ్చు.

దీనికి సంబంధించిన నిర్ణయం అతి త్వరలోనే వెల్లడి కావొచ్చు. దర్శకుడు గోపిచంద్ మలినేని ఒకపక్క షూటింగ్ చేస్తూనే ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. దీని తర్వాత బాలయ్య – కొరటాల శివ మూవీ వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలి. అందుకే గ్యాప్ లేకుండా పని చేస్తున్నారు. వీరసింహారెడ్డి తర్వాత రిపీటవుతున్న కలయిక, పెద్దితో ప్రొడక్షన్ డెబ్యూ చేసిన వృద్ధి సినిమాస్ నిర్మాణం వెరసి ఎన్బికె 111 మీద అంచనాలైతే భారీగా ఉన్నాయి.  

This post was last modified on July 17, 2026 10:17 am

Share

Recent Posts

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

32 minutes ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

2 hours ago

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

2 hours ago

ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

3 hours ago

విజయదశమి క్లాష్… ‘పంచతంత్ర’ పోటీ

ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…

3 hours ago

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

14 hours ago