ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్. ప్రేక్షకులు మాత్రమే కాదు.. విమర్శకులూ ఇదే మాట అంటారు. వినూత్నమైన కథలు ఎంచుకుని, వావ్ అనిపించే స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే దర్శకుడతను. తన చివరి చిత్రం ‘ఆపెన్ హైమర్’ను మాస్ మెచ్చకపోయినా సరే.. దాంతోనూ భారీ వసూళ్లు రాబట్టాడు. ఇప్పుడు నోలన్ నుంచి రాబోతున్న ‘ది ఒడిస్సీ’కి హైప్ మామూలుగా లేదు.
ఈ హైప్‌ను ఇంకా పెంచేలా.. స్పెషల్ ప్రివ్యూల రివ్యూలు ఫుల్ పాజిటివ్‌గా వచ్చాయి. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనల నుంచి అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా ఫుల్ పాజిటివ్‌గా ఉన్నాయి. రోటన్ టమోటాస్‌లో 98 శాతం రేటింగ్ తెచ్చుకుంది ‘ది ఒడిస్సీ’. నోలన్ సినిమాకు మామూలుగానే భారీ ఓపెనింగ్స్ వస్తాయి. పైగా ‘ది ఒడిస్సీ’కి ముందే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఆకాశమే హద్దు అని భావిస్తున్నారు.
‘ది ఒడిస్సీ’కి ఇండియాలో ఉన్న క్రేజ్, దానికి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇండియన్ సూపర్ స్టార్ నటించిన చిత్రం కోసం ఎగబడ్డట్లే ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎగబడి టికెట్లు కొంటున్నారు. ఈ వారం ఇండియాలో ఏ ప్రాంతీయ భాషా చిత్రం కూడా ‘ది ఒడిస్సీ’ ముందు నిలిచేలా లేదు. మల్టీప్లెక్సుల్లో మెజారిటీ షోలు నోలన్ సినిమాకే ఇచ్చేశారు. వాటిలో చాలా వరకు ఫుల్స్ పడిపోతున్నాయి.
ఆల్రెడీ అనేక షోలు సోల్డ్ ఔట్ అవగా.. మిగతావి ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ది ఒడిస్సీ’ జోరు చూసి.. ఎప్పటికప్పుడు స్క్రీన్లు పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా నోలన్ సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టబోతోందని అర్థమవుతోంది. ఈ చిత్రంతో వరల్డ్ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ నోలన్ బద్దలు కొట్టేస్తే ఆశ్చర్యం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates