Movie News

లెనిన్ వేడి తగ్గిందా?

గత శుక్రవారం ఒక మోస్తరు అంచనాల మధ్య విడుదలైన అక్కినేని అఖిల్ సినిమా ‘లెనిన్’ తొలి వీకెండ్లో ఆ అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. వారాంతంలోనే సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరువ అయింది. మరీ మేకర్స్ ప్రకటించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు కానీ.. అఖిల్ మార్కెట్, సినిమా స్థాయికి చాలా ఎక్కువ వసూళ్లే వచ్చాయి. ఐతే టాక్ కొంచెం డివైడ్‌గా ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం వీకెండ్ తర్వాత నిలబడగలదా అన్న సందేహాలు కలిగాయి.

కానీ సోమవారం ఈ చిత్రానికి రూ.5 కోట్ల మేర గ్రాస్ రావడంతో సినిమా నిలబడినట్లే కనిపించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ‘లెనిన్’ వీక్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం.. ఆ రోజుతో పోలిస్తే బుధవారం కలెక్షన్లు తగ్గాయి. ఆరో రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ 3 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ కలెక్ట్ చేసిందంతే.

వీకెండ్లో ఈ సినిమా జోరు చూస్తే.. బాక్సాఫీస్ దగ్గర పోటీ లేని నేపథ్యంలో వీక్ డేస్‌లోనూ ఇంకా మెరుగైన వసూళ్లు రాబడుతుందనే అంచనాలు కలిగాయి. సోమవారం పరిస్థితి ఆశాజనకంగా కనిపించింది కూడా. కానీ తర్వాత రోజు రోజుకూ వసూళ్లు తగ్గుతున్నాయి. రెండో వీకెండ్లో ఈ చిత్రం ఏమేర వసూళ్లు రాబడుతుందన్నది సందేహం.

ఈ వారం వచ్చే తెలుగు చిత్రాల నుంచి ‘లెనిన్’ పెద్ద పోటీ లేదు కానీ.. హాలీవుడ్ మూవీ ‘ది ఒడిస్సీ’ ధాటిని తట్టుకోవడం మాత్రం కష్టమే అనిపిస్తోంది. ఆ చిత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజవుతుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుమీదున్నాయి. కాబట్టి ‘లెనిన్’ బాక్సాఫీస్ రన్ ఈ వీకెండ్లో ఆశించిన స్థాయిలో ఉంటుందా అన్నది ప్రశ్నార్థకమే.

This post was last modified on July 16, 2026 1:46 pm

Share

Recent Posts

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

2 minutes ago

ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

49 minutes ago

విజయదశమి క్లాష్… ‘పంచతంత్ర’ పోటీ

ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…

1 hour ago

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

12 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

12 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

12 hours ago