అనుకున్నట్టే ఫౌజీ విడుదల తేదీ డిసెంబర్ 3 లాకైపోయింది. ఇది రెండు వారాల క్రితమే లీకైన న్యూస్ అయినప్పటికీ ఫైనల్ గా మైత్రి మూవీ మేకర్స్ నుంచి కొత్త పోస్టర్ రూపంలో క్లారిటీ వచ్చేసింది. రెండు యూనిట్లు హైదరాబాద్ లో ఒకేసారి పని చేయడం చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో డేట్ మిస్ కాకూడదనే లక్ష్యం దీని వెనుక కనిపిస్తోంది. క్రిస్మస్ కి షారుఖ్ ఖాన్ కింగ్ లాంటి భారీ చిత్రాలు ఉన్న నేపథ్యంలో మొదటి వారంలోనే రావడం పుష్ప 2 తరహాలో ఫౌజీకి చాలా ప్లస్ కానుంది.
ఇక పోస్టర్ విషయానికి వస్తే ఛాతి మీద చొక్కా లేకుండా యుద్ధభూమిలో వందలాది శవాల మధ్య తుపాకీ పట్టుకుని వర్షంలో తడుస్తున్న ప్రభాస్ లుక్ చాలా ఇంటెన్స్ గా ఉంది. అయితే దీని వెనుక ఉన్న స్టోరీని మనం అర్థం చేసుకోవాలి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ప్రభాస్ ఇందులో బ్రాహ్మణ సైనికుడిగా నటిస్తున్నాడు. అది కూడా బ్రిటిష్ సైన్యంలో. అలా ఎందుకు చేశాడు, సుభాష్ చంద్ర బోస్ లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ తో తనకున్న సంబంధం ఏంటనేది 1932 బ్యాక్ డ్రాప్ లో చూపించబోతున్నారు.
మొదట అందమైన ప్రేమకథగా మొదలై క్రమంగా టెర్రిఫిక్ వార్ డ్రామాగా రూపాంతరం చెందే వైనాన్ని దర్శకుడు హను రాఘవపూడి అద్భుతంగా తెరకెక్కించారని యూనిట్ సమాచారం. విజువల్స్, విఎఫ్ఎక్స్, మేకింగ్ క్వాలిటీ దేనికవే అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయట. ఫ్యాన్స్ ఎక్కువ స్పిరిట్ మీద దృష్టి పెడుతున్నారు కానీ ట్రైలర్ వచ్చాక ఫౌజీ గురించే మాట్లాడుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ ఆ స్థాయిలో ఉందన్న మాట.
ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ తరహా జానర్ బాలీవుడ్ కు కొత్త కాకపోయినా ఇంతకు ముందు చూడలేదనే తరహాలో ట్రీట్ మెంట్ ఉంటుందట. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఫౌజీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ మొదటి వారం గత కొన్ని సంవత్సరాలుగా రికార్డులు బద్దలు కొట్టే వీక్ గా మారిపోయింది. అఖండ, పుష్ప 2, యానిమల్ తరహాలో ఫౌజీ కూడా ఆ జాబితాలో చేరుతుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates