ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మనోళ్లు ఎన్నో సినిమాలు దీంట్లో ఎంజాయ్ చేశారు. స్క్రీన్, సౌండ్, సీటింగ్ అంతా వేరే లెవెల్ లో ఉండే ఈ ఎక్స్ పీరియన్స్ ముంబై, కోచి, బెంగళూరు లాంటి నగరాల్లో ఉంది కానీ మన దగ్గర లేకపోవడం విచారకరం. లక్కీగా వచ్చే ఏడాది భాగ్యనగర వాసులకు ఆ అదృష్టం కలగనుంది. ఇంకో రెండు అదనంగా వచ్చే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉండగా వారణాసిని ప్రత్యేకంగా ఐమాక్స్ లో షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం రాజమౌళి చాలా ఖరీదైన టెక్నాలజీని వాడుతున్నారు. గ్లోబల్ ఆడియన్స్ కి తాము చూస్తున్నది హాలీవుడ్ మూవీ అనిపించే స్థాయిలో ప్రతి విజువల్ ని శిల్పంలా చెక్కుతున్నారు. అయితే ఓవర్సీస్ మార్కెట్ స్క్రీన్ల పంపకాల విషయంలో రెండు హాలీవుడ్ మూవీస్ నుంచి ఇబ్బందులు తలెత్తేలా ఉన్నాయి. వాటిలో మొదటిది గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సూపర్ నోవా (మార్చి 26) కాగా మరొకటి పానిక్ కేర్ ఫుల్లీ (ఏప్రిల్ 9).
వీటి మధ్యలో వారణాసి వస్తోంది. ఇంగ్లీష్ సినిమాలకు సహజంగానే అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ చైన్ల మద్దతు బలంగా ఉంటుంది. ఆరు నెలల ముందే అగ్రిమెంట్లు పూర్తి చేసుకుంటారు. హరిహరాదులు దిగి వచ్చినా వీటిలో మార్పు ఉండదు. మనలాగా చివరి నిమిషం దాకా సాగదీసి తాపీగా పోస్ట్ పోన్ చేయడం లాంటి వ్యవహారాలకు వాళ్ళు దూరం. అందుకే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ముందుగానే జాగ్రత్త పడమని జక్కన్న, ఎస్ఎస్ కార్తికేయలకు సూచిస్తున్నారట.
వారణాసి ఖచ్చితంగా ఏప్రిల్ 7 విడుదలయ్యే పక్షంలో ఇప్పటి నుంచే జాగ్రత్త వహించడం అవసరం. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ని మించిపోయేలా అన్ని దేశాల ప్రేక్షకులకు దీన్ని చేరవేయాలనే ధృడ సంకల్పంతో రాజమౌళి పగలురాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారు. అలాంటిది హాలీవుడ్ కాంపిటీషన్ వల్ల స్క్రీన్లు తగ్గితే లేనిపోని ఇబ్బంది తలెత్తుతుంది. ఇప్పటికైతే డేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. ఆరు నూరైనా చెప్పిన తేదీకే వారణాసి రావడం ఖాయమని టాక్.
This post was last modified on July 16, 2026 11:44 am
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోవడం తమిళనాడులో సంచలనం సృష్టిస్తుంది. ఒకేసారి…
ముందే హెచ్చరిక ఉన్నప్పటికీ ప్రకృతిని పూర్తిగా ఎదురుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం రాజమండ్రి, కాకినాడ కేంద్రంగా ముంచేస్తున్న అర్నబ్…
తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకడైన ధనుష్.. ప్రయోగాల నుంచి కొంచెం పక్కకు వచ్చి ఈసారి పక్కా కమర్షియల్ సినిమానే చేస్తున్నట్లున్నాడు.…
తండేల్ తర్వాత ఏడాది గడిచినా నాగచైతన్య నుంచి కొత్త సినిమా రాలేదు. అభిమానులు ఎదురు చూసి చూసి నెలలు అయిపోయాయి…
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఈ ఇద్దరిలో ఎవరి సినిమా రిలీజైనా సోషల్ మీడియా హీటెక్కిపోవడం మామూలే. వాళ్లు చేసే…
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మంచి అంచనాల మధ్య కొన్ని నెలల ముందు హీరోగా అరంగేట్రం చేశాడు ఘట్టమనేని…