మాములుగా మన తెలుగు తమిళ సినిమాల్లో మాఫియా అంటే ముంబైనే చూపిస్తారు. రజనీకాంత్ బాషా నుంచి పవన్ కళ్యాణ్ ఓజి దాకా ఎన్ని వచ్చాయో లెక్కబెట్టుకుంటూ వెళ్తే వందల్లో తేలుతాయి. అలాని కేవలం ఆ నగరంలోనే నేరస్థులు ఉంటారని కాదు. ఆర్థిక రాజధాని కాబట్టి అలా వాడుకుంటారు తప్పించి మాఫియా అనేది అన్ని చోట్లా ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం మెగాస్టార్ 158. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరేవేగంగా జరుగుతోంది.
కథలో కీలక భాగం కోల్కతాలో జరుగుతుంది. అందుకే టీమ్ ఆగస్ట్ 1 నుంచి అక్కడ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంది. అందరూ కాకాజీగా పిలిచే చిరంజీవి ఆ సిటీలో ఏం చేసేవాడన్నది తెరమీద చూడాలి. కోల్కతా పేరు చెప్పగానే మెగా ఫ్యాన్స్ కి గుర్తు వచ్చే పేరు చూడాలని ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని అశ్విని దత్ నిర్మించారు. కొన్ని సెట్లు వేయడంతో పాటు ముఖ్యమైన ఎపిసోడ్స్ ని కోల్కతా వెళ్లి షూట్ చేసుకొచ్చారు. స్క్రీన్ మీద ఇది బాగా వర్కౌట్ అయ్యింది.
తర్వాత చిరంజీవికి చాలా సంవత్సరాలు ఇంకే సినిమాలోనూ కోల్కతా వెళ్లే అవసరం పడలేదు. 2023 భోళా శంకర్ లో దర్శకుడు మెహర్ రమేష్ ఆ ఛాన్స్ తీసుకున్నారు. తమిళ హిట్ వేదాళం రీమేక్ కాబట్టి దానికి అనుగుణంగా స్టోరీని కోల్కతాలో నడిపించారు. అయితే ఇది ఎంత పెద్ద డిజాస్టరయ్యిందో చెప్పనవసరం లేదు. పేరు తలుచుకుంటే చాలు ఫ్యాన్స్ ఇప్పటికీ భయపడుతుంటారు. మళ్ళీ మూడేళ్ళ తర్వాత కోల్కతా బ్యాక్ డ్రాప్ చిరంజీవి మూవీలో వాడుతున్నారు.
అయితే టెన్షన్ పడేందుకు ఏమి లేదు. ఎందుకంటే ఇన్ సైడ్ టాక్ ప్రకారం దర్శకుడు బాబీ కొల్లి నెక్స్ట్ లెవెల్ లో మాస్ ఎలిమెంట్స్ రాసుకున్నారట. వాల్తేరు వీరయ్యని తలదన్నేలా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో చిరుని కొత్తగా చూపించబోతున్నట్టు తెలిసింది. కోల్కతా ట్రాక్ చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తుండగా అనస్వర రాజన్ చిరు కూతురిగా కనిపించనుంది. ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ మెంట్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates