ది రాజా సాబ్ తర్వాత దాన్ని మర్చిపోయే సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వాళ్ళు ఎక్కువగా స్పిరిట్ మీద ఫోకస్ పెడుతున్నారు కానీ సైలెంట్ కిల్లర్ లాగా షూటింగ్ జరుపుకుంటున్న ఫౌజీ అంచనాలకు మించి వస్తోందని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. డిసెంబర్ 3 రిలీజ్ టార్గెట్ ని ఎట్టి పరిస్థితుల్లో చేరుకోవాలనే ఉద్దేశంతో ఆఘమేఘాల మీద పరుగులు పెడుతున్నారు. ఓటిటి డీల్ కూడా దానికి అనుగుణంగా జరిగిందట.
ప్రస్తుతం ఫౌజీ కోసం హైదరాబాద్ లో రెండు యూనిట్లు పని చేస్తున్నాయి. కోకాపేట్, తాహెర్ సౌండ్ యూనిట్ వద్ద వేర్వేరు భాగాల చిత్రీకరణ జరుగుతోంది. ప్రభాస్ డేట్లు ఇంకో నెల రోజులు అవసరమవుతాయని వినికిడి. వాటిని పూర్తిగా ఇచ్చేలా ఆల్రెడీ ప్లానింగ్ జరిగిపోయిందని, స్పిరిట్, కల్కి 2కి కొంచెం బ్రేక్ ఇచ్చయినా సరే ముందు ఫౌజీ పూర్తి కావాలనే లక్ష్యంతో యూనిట్ సర్వశక్తులు ధారపోయడానికి రెడీ అయినట్టు కనిపిస్తోంది.
ఒకరకంగా చెప్పాలంటే సంక్రాంతి కంటే డిసెంబరే మంచి ఆప్షన్. ఎందుకంటే సోలో రిలీజ్ దక్కుతుంది. అఖండ, యానిమల్, పుష్ప 2, సలార్ ఈ విధంగానే లాభపడ్డాయి. అలా కాకుండా జనవరిలో వస్తే పండగ సినిమాలతో పోటీ వల్ల రెవిన్యూ ఎఫెక్ట్ అవుతుంది. రాజా సాబ్ ఫ్లాప్ అయినా నెంబర్లు గణనీయంగా తగ్గిపోవడానికి కారణం ఆ తర్వాత వచ్చిన వాటికి పాజిటివ్ టాక్ రావడమే. అందుకే ఫౌజీ విషయంలో అలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి.
ఇమాన్వి హీరోయిన్ గా నటించిన ఫౌజీలో విశాల్ చంద్రశేఖర్ పాటలు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మ్యూజికల్ గా సీతారామంని మించి ఉండేలా దర్శకుడు హను రాఘవపూడి జాగ్రత్తలు తీసుకున్నారట. స్వతంత్రం రాక ముందు ఒక భారత సైనికుడి ప్రేమకథగా దీన్ని చెబుతున్నప్పటికీ సుభాష్ చంద్ర బోస్ లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ రెఫరెన్సులు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీలు చూసుకుని ఇంకో నెల రోజుల్లో చేయొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates