వీకెండ్ వసూళ్లను ఘనంగా రాబట్టుకున్న లెనిన్ అసలు పరీక్ష మొదలుపెట్టింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద ట్రేడ్ వర్గాలు చాలా ఆశాభావంతో ఉన్నాయి. ఎలాగూ చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు లేవు కాబట్టి ఆ అవకాశాన్ని లెనిన్ పూర్తిగా వాడుకునే ఛాన్స్ ఉంది. అదే నిజమైతే వారం పది రోజుల దాకా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రన్ వస్తుంది. ఇదిలా ఉండగా లెనిన్ లో కొన్ని ట్విస్టులు కీలకంగా నిలిచిన సంగతి తెలిసిందే.
1999 బాలకృష్ణ హీరోగా క్రిష్ణబాబు సినిమా వచ్చింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. అందులో ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ఒక షాకింగ్ సీన్ ఉంటుంది. తోటలో ఫైట్ చేస్తున్న బాలయ్య కళ్ళలో విలన్ రామిరెడ్డి కారం కొడతాడు. చేతిలో కత్తి పట్టుకున్న బాలయ్య అతన్ని చంపుతున్నా అనుకున్న నోట్లో గుడ్డలు కుక్కిన హీరోయిన్ మీనాను పొడిచేస్తాడు. ఫలితంగా ఆమె చనిపోతుంది. అప్పట్లో ఆడియన్స్ దీన్ని జీర్ణించుకోలేకపోయారు. క్రిష్ణబాబు అంచనాలు అందుకోలేక ఫెయిలయ్యింది.
కట్ చేస్తే ఇప్పుడు లెనిన్ ఇదే తరహా ట్విస్టుని దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు క్లైమాక్స్ లో పెట్టారు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య వచ్చే ఈ సీన్ హీరో రివెంజ్ కు దారి తీసి కథ మొత్తాన్ని నడిపిస్తుంది. అయితే ఇది కాకతాళీయంగా జరిగిందా లేక ఎప్పుడో ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చింది కాబట్టి అందరూ మర్చిపోయి ఉంటారని దర్శకుడు అలా రాసుకున్నారా అనేది ఆయనగా చెబితే తప్ప బయట పడదు. దానికి ఛాన్స్ ఉండకపోవచ్చు.
సరే స్ఫూర్తి చెందినా కావాలని తీసుకున్నా ఏదైతేనేం లెనిన్ లో ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. దానికి సాక్ష్యమే మూడు రోజుల వసూళ్లు. సోషల్ మీడియా చాలా అలెర్ట్ గా ఉన్న ట్రెండ్ లో ఏది ఎక్కడ నుంచి వచ్చిందనేది తవ్వకాల రూపంలో బయట పడుతోంది. ఇప్పుడు క్రిష్ణబాబు, లెనిన్ మధ్య లింకు ఈ విధంగానే బయటికి వచ్చింది. ఏం చేశామనేది కాదు హిట్ కొట్టామా లేదా అనేది ఇంపార్టెంట్. లెనిన్ ఈ విషయంలో విజయం సాధించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates