Movie News

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ అవుతోంది. నిజానికిది జూలై 9 రావాల్సింది. ప్రమోషన్లకు టైం తక్కువగా ఉండటంతో పాటు లెనిన్ కున్న బజ్ చూసి నిర్ణయం మార్చుకున్నారు. అది ఎంత పెద్ద ప్లస్ అయ్యిందో ఇప్పుడు కళ్ళముందు కనిపిస్తోంది. అఖిల్ దూకుడు ముందు జయకృష్ణ నిలవడం అంత సులభంగా ఉండేది కాదు. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేసి కథేంటో చెప్పే ప్రయత్నం చేశారు.

తిరుపతిలో సరదాగా తిరుగుతూ జీవితాన్ని జాలీగా గడిపే ఒక మధ్యతరగతి కుర్రాడు (జయకృష్ణ) తొలిచూపులోనే ఓ అమ్మాయి (రశ తదాని)ని ఇష్టపడి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే బళ్లారికి చెందిన ఫ్యాక్షనిస్టు వెంకటప్పయ్య (మోహన్ బాబు) ఎంట్రీతో వీళ్ళ లవ్ స్టోరీ హింసాత్మక మలుపు తీసుకుంటుంది. ఎంతగా అంటే చావు అంచుల దాకా ఆ ప్రేమ జంట వెళ్లేంత. అసలు వీళ్ళ మధ్యలో అతను ఎందుకు వచ్చాడు, రెండు ఊళ్ళ మధ్య ఉన్న లింక్ ఏంటనేది తెరమీద చూడాలి.

విజువల్స్, మేకింగ్ గట్రా చూస్తుంటే ఇంటెన్స్ లవ్ స్టోరీగా దర్శకుడు అజయ్ భూపతి దీన్ని తీర్చిదిద్దిన వైనం కనిపిస్తుంది. జయకృష్ణ, రషా తదాని ఇద్దరూ కొత్తవాళ్లే అయినప్పటికీ మంచి ఈజ్ తో కనిపిస్తున్నారు. జయకృష్ణ యాక్టింగ్ స్కిల్స్ గురించి అవగాహన రావాలంటే మొత్తం సినిమా చూశాక కానీ చెప్పలేం. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చిన ఈ వయొలెంట్ లవ్ స్టోరీలో వాసుకి, నరేష్, బ్రహ్మాజీ, అజయ్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు చాలానే ఉన్నారు.

మహేష్ బాబు రాజకుమారుడు విడుదలైన డేట్ జూలై 30నే వస్తున్న శ్రీనివాస మంగాపురం హిట్ కావడం ఆ ఫ్యామిలీకి కీలకం. ఎందుకంటే భౌతికంగా దూరమైన రమేష్ బాబు హీరోగా అందుకోలేని ఎత్తులు ఆయన కొడుకు అందుకుంటాడనే ఆశతో మంచి బడ్జెట్, సెటప్ దీని కోసం నిర్మాతలు అశ్వినీదత్, కిరణ్ భారీగా ఖర్చు పెట్టారు. ఈ నెల చివరి వారంలో మహేష్ బాబు ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ప్లానింగ్ జరుగుతోంది. త్వరలోనే వివరాలు ప్రకటించబోతున్నారు.

This post was last modified on July 12, 2026 8:08 pm

Share

Recent Posts

పెళ్లి గురించి హనుమాన్ హీరో క్లారిటీ

టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…

5 hours ago

లెక్క తప్పిన చుక్క చిత్రాలు… ఇమేజ్ మీద మరకలు

భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…

5 hours ago

సెక్యూరిటీ లేకుండా వెళ్లి చంద్రబాబుతో పవన్ ఏం చెప్పారు?

సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…

6 hours ago

అర్జునుడి కష్టాలు పేరుకి తగ్గట్టే ఉన్నాయి

తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…

7 hours ago

ప్రశాంత్ నీల్ బ్రాండ్ మహత్యం ఇది

కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…

7 hours ago

సంజూ మొదలెట్టాడు… నమన్ ధీర్ ముగించాడు!

225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…

8 hours ago