మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే ఆయన సినిమాలు ఒరిజినల్ వెర్షన్ తో పాటు అదే తేదీకి తెలుగులో కూడా థియేటర్ రిలీజ్ జరుపుకుంటున్నాయి. అందులో భాగంగా వచ్చిందే ఐ నో బడి. ఇదే టైటిల్ తో ఇక్కడ ప్రచారం చేశారు కానీ స్క్రీన్ మీద మాత్రం ఐ ఎవరూ లేరు అని రావడం అసలు ట్విస్టు. ప్రమోషన్ల కోసం పృథ్విరాజ్ హైదరాబాద్ వచ్చి మరీ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
ఒక రోజు ఆలస్యంగా ఏపీ తెలంగాణలో విడుదలైన ఐ నో బడికి ఓపెనింగ్స్ రాలేదు. అంతా లెనిన్ మయం కావడంతో బాక్సాఫీస్ వద్ద వేరే సినిమాల గురించి చర్చ కానీ హైప్ కానీ కనిపించడం లేదు. భారీ దొంగతనం కేసులో ఇరుక్కున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి దాన్నుంచి బయట పడే క్రమంలో ఎదురుకున్న సమస్యలు, ప్రమాదాలే ప్రధానాంశంగా దర్శకుడు నిషం బషీర్ దీన్ని రూపొందించారు. ఫస్ట్ హాఫ్ మంచి రిపోర్ట్స్ తెచ్చుకోగా సెకండాఫ్ మీద మిశ్రమ స్పందన దక్కించుకుంది.
చూస్తుంటే పోటీ తాకిడిలో ఏ మేరకు నిలుస్తుందనేది అనుమానంగానే ఉందని ట్రేడ్ టాక్. అసలిది రిలీజైన విషయమే జనాలకు తెలియనంత వీక్ గా పబ్లిసిటీ చేశారు. అందుకే బిసి సెంటర్లలో కొన్ని చోట్ల అసలు షో పడకుండానే క్యాన్సిల్ అయ్యాయి. కారణం పబ్లిక్ కనీస స్థాయిలో రాకపోవడమే. లెనిన్ తర్వాత విచిత్రంగా క్రౌడ్స్ ని అంతో ఇంతో లాగుతుంది ఇంగ్లీష్ డబ్బింగ్ ఈవిల్ డెడ్ బర్న్ కావడం గమనార్షం. పృథ్విరాజ్ ని లైట్ తీసుకున్నారు కాబోలు.
వారణాసిలో విలన్ గా నటిస్తున్న పృథ్విరాజ్ క్రమంగా తెలుగు మార్కెట్ ని బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నారు కానీ వర్కౌట్ కావడం లేదు. మోహన్ లాల్, మమ్ముట్టిల వల్లే కానిది తను ట్రై చేయాలనుకోవడం తప్పేం కాదు. కానీ మన ఆడియన్స్ అభిరుచులకు మల్లువుడ్ కంటెంట్ ఓటిటిలో చూసేందుకు బాగుంటుంది కానీ డబ్బులిచ్చి థియేటర్లలో చూసేందుకు కాదు. మరో డబ్బింగ్ మూవీ హృదయం మురళికి కొంచెం బెటర్ రెస్పాన్స్ రావడం నో బడికి ఇబ్బందిగా మారనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates