Movie News

చెన్నై లవ్ స్టోరీకి సీఎం సినిమా ముప్పు

ఈ నెలలో రాబోతున్న చిత్రాల్లో ‘చెన్నై లవ్ స్టోరీ’ చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ‘బేబీ’తో ఎవ్వరూ ఊహించని విజయాన్నందుకున్న సాయి రాజేష్.. ఈసారి కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘బేబీ’ తర్వాత ఎస్కేఎన్ కూడా ఇందులో నిర్మాణ భాగస్వామి అయ్యాడు. రవి నంబూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ లాంటి చక్కటి జంట లీడ్ రోల్స్ చేసింది. 

ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోతో మొదలుపెట్టి ప్రతి ప్రోమో ఆకట్టుకుంది. ఇప్పటికే మూవీకి మంచి బజ్ క్రియేట్ కాగా.. రిలీజ్ దగ్గర పడేసరికి ఇంకా హైప్ వస్తుందని భావిస్తున్నారు. ఐతే ఈ సినిమా కథంతా నడిచేది చెన్నైలోనే కావడం.. హీరోయిన్ శ్రీ గౌరీప్రియకు తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఈ చిత్రాన్ని తమిళంలోనూ రిలీజ్ చేయబోతోంది టీం. కానీ తమిళంలో ‘చెన్నై లవ్ స్టోరీ’కి పెద్ద అడ్డంకి తప్పేలా లేదు.

సీఎం విజయ్ చివరి చిత్రం ‘జననాగయన్’ అన్ని అడ్డంకులనూ దాటుకుని ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఆ డేట్ పక్కా అనే అంటున్నారు. తాజాగా కెనడా డిస్ట్రిబ్యూటర్ కూడా రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ పోస్టర్ వదిలాడు. దీంతో 24న సినిమా రాబోతున్నట్లే. ‘జననాయగన్’ 24న రిలీజైందంటే తమిళనాట పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో తమిళనాడు అవతల ముఖ్యమైన నగరాల్లో కూడా ఈ సినిమా సందడి బాగానే ఉండొచ్చు. 

దేశాల్లో కూడా ‘జననాయగన్’ భారీ స్థాయిలో విడుదలవుతుంది. అన్ని చోట్లా అదే రోజు విడుదల కాబోయే ‘చెన్నై లవ్ స్టోరీ’కి గట్టి పోటీ తప్పదు. తమిళ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కథ కావడంతో తమిళనాడులోనూ ఈ సినిమా బాగా ప్రభావం చూపుతుందని మేకర్స్ ఆశించారు. కానీ ‘జననాయగన్’ ఉండగా దీని వైపు దృష్టి మళ్లడం కష్టమే. అలా అని టీం రిలీజ్ డేట్‌ను వాయిదా వేసే పరిస్థితి లేదు. ప్రధాన మార్కెట్ అయిన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గట్టి ప్రభావమే చూపుతుందని భావిస్తున్నారు. కాబట్టి 24న సినిమా రిలీజ్ కావడం ఖాయం.

This post was last modified on July 9, 2026 7:35 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

41 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago