Pics: బ్యాంకాక్‌ ను షేక్ చేసిన మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన షిసెడో అల్టిమ్యూన్ గ్రాండ్ ఈవెంట్‌లో భారత తరఫున పాల్గొన్న తమన్నా.. గ్లోబల్ స్టార్స్‌తో కలిసి మెరిసిపోయింది. ఈ వేడుకలో బ్లాక్‌పింక్ లీసా, థాయ్ స్టార్ విన్ మెటావిన్‌తో ఒకే వేదికను పంచుకోవడం విశేషం.

ఈ ఈవెంట్ కోసం బ్లాక్ కలర్ హాల్టర్ గౌన్‌లో తమన్నా అదిరిపోయే లుక్‌లో కనిపించింది. డీప్ నెక్, థై-హై స్లిట్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన మిల్కీ బ్యూటీ.. గోల్డ్ పెండెంట్, స్టేట్‌మెంట్ ఇయర్‌రింగ్స్‌తో లుక్‌ను కంప్లీట్ చేసింది. రెడ్ లిప్‌స్టిక్, స్లీక్ హెయిర్‌స్టైల్‌తో ఆమె ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.