దురంధర్ రాకముందు స్పై యాక్షన్ సినిమాలతో ఒకప్పుడు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పంట పండించుకున్నారు. ముఖ్యంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లయితే ఈ జానర్ సినిమాల కోసం ఒక యూనివర్శ్‌నే క్రియేట్ చేశారు. అందులో భాగంగా వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ లాంటి సినిమాలు భారీ వసూళ్లు దక్కించుకున్నాయి. యశ్ రాజ్ స్పై యూనివర్శ్‌లో భాగంగా మరెన్నో చిత్రాలను ప్లాన్ చేశారు. ఉన్న ఫ్రాంఛైజీలను కొనసాగిస్తూ.. కొత్తవి కూడా తీసుకురావాలని అనుకున్నారు.
కానీ ఒకే తరహా సినిమాలు తీస్తుంటే ప్రేక్షకులకు మొహం మొత్తకుండా ఉంటుందా? రా ఏజెంట్లు, ఆర్మీ ఆఫీసర్లు, పాకిస్థాన్ ఐఎస్ఐ అంటూ కథలు అక్కడే తిప్పుతుండడంతో ప్రేక్షకులకు విసుగొచ్చేసింది. ఆల్రెడీ టైగర్-3, వార్-2 చిత్రాలు దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. ఇప్పుడేమో ఆల్ఫా సినిమా యశ్ రాజ్ స్పై యూనివర్శ్‌లో అతి పెద్ద డిజాస్టర్‌గా నిలవబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఆల్ఫా ట్రైలర్ చూస్తేనే ఇది వర్కవుట్ కాదని అర్థమైంది. ఇప్పుడు ప్రేక్షకులు సినిమాను ఔట్ రైట్‌గా రిజెక్ట్ చేశారు. టైగర్-3, వార్-2 చిత్రాలకు కనీసం ఓపెనింగ్స్ అయినా వచ్చాయి. కానీ ఆల్ఫాకు అదీ లేదు. ఇందుకు ప్రధాన కారణం దురంధర్ అనడంలో సందేహం లేదు. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా.. స్పై సినిమాలను ఎంత అథెంటిగ్గా, ఎంత ఆసక్తికరంగా తీయాలో చెప్పడానికి దురంధర్ ఉదాహరణగా నిలిచింది. ఆ సినిమా ఇచ్చిన కిక్కు మామూలుది కాదు.
అలాంటి సినిమా చూశాక బాలీవుడ్లో ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న స్పై సినిమాలు ఏమాత్రం ఆనే పరిస్థితి లేదు. మామూలుగా ఆ ఫార్మాట్ అంటేనే ఆల్రెడీ జనాలకు విసుగొచ్చేసింది. పైగా ఇప్పుడు దురంధర్ కళ్ల ముందు మెదులుతోంది. అలాంటపుడు ఏ కొత్తదనం లేని, డ్రమటిగ్గా అనిపించే యశ్ రాజ్ వాళ్ల స్పై సినిమాలను జనం ఏం చూస్తారు. మొత్తంగా పరిస్థితి చూస్తే.. యశ్ రాజ్ స్పై యూనివర్శ్‌తో పాటు బాలీవుడ్ నుంచి వచ్చే ఆ తరహా సినిమాలన్నింటినీ దురంధర్ ధ్వంసం చేసిందని చెప్పవచ్చు. ఆల్ఫా తర్వాత యశ్ రాజ్ వాళ్లు ఇంకో స్పై మూవీ తీసే సాహసం చేయకపోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
