సమంత మా ఇంటి బంగారం రిలీజై ఘనవిజయం సాధించాక ఆమె తల్లి కాబోతున్న వార్తను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఓ రెండు సంవత్సరాలు బ్రేక్ తీసుకోవాల్సి వస్తుందని భర్త రాజ్ నిడిమోరు చెప్పిన నేపథ్యంలో ఇకపై తెరమీద సామ్ ని చూడాలంటే లాంగ్ వెయిటింగ్ తప్పదని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే అంతకన్నా ముందు మరోసారి సమంతని స్క్రీన్ మీద దర్శించవచ్చు. కాకపోతే సినిమాలో కాదు. ఒక సెలబ్రిటీ టాక్ షో ద్వారా తమిళ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.
సోని లివ్ ఓటిటి యాప్ కోసం సమంత ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం చేస్తోంది. గతంలో ఆహాకు సామ్ జామ్ చేసి చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి ఎందరో స్టార్లతో ముచ్చట జరిపిన సమంత తర్వాత దాని సెకండ్ సీజన్ కొనసాగించలేదు. బాలయ్య ఆన్ స్టాపబుల్ వల్ల సామ్ జామ్ కొంత ఎఫెక్ట్ అయ్యింది. దీంతో ఆపేశారు. ఈలోగా అనారోగ్యం, సెట్స్ మీద ఉన్న షూటింగులు తిరిగి వచ్చేందుకు ప్రేరేపించలేదు. మళ్ళీ ఇప్పుడు బుల్లితెరకు కంబ్యాక్ ఇస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం మొదటి ఎపిసోడ్ కి నాని అతిథిగా రాబోతున్నాడు. ప్యారడైజ్ ప్రమోషన్లకు శ్రీకారం దీంతోనే చుట్టబోతున్నట్టు తెలిసింది. ఊహించని కాంబోలు ఈ షోలో ఉంటాయని వినికిడి. సోనీ లైవ్ దీని గురించి అధికారికంగా ప్రకటించింది కానీ కార్యక్రమ రూపు రేఖలు వగైరా వెల్లడించలేదు. రాబోయే రెందు మూడు రోజుల్లో మొత్తం రివీల్ చేస్తారు. సామ్ జామ్ తో భారీ మేజిక్ చేయలేకపోయిన సమంత ఈసారి ఇందులో హిట్టు కొడుతుందేమో.
ఇక మా ఇంటి బంగారం విషయానికి వస్తే థియేటర్ రన్ ఇప్పటికీ బలంగా ఉంది. మూడో వారంలో ఎంటరయ్యాక కూడా మెయిన్ సెంటర్స్ లో వసూళ్లు వస్తున్నాయి. కొత్త రిలీజుల్లో యునానిమస్ టాక్ తెచ్చుకున్నవి లేకపోవడం సమంతకు ప్లస్ అవుతోంది. తొంభై కోట్లకు దగ్గరగా ఉన్న ఈ సినిమా ఫైనల్ గా వంద కోట్ల మార్కు చేరుకుంటుందా లేదానే దాని మీద అభిమానులు ఎదురు చూస్తున్నారు. అదే జరిగితే సింగల్ లాంగ్వేజ్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో సరికొత్త రికార్డు నమోదైనట్టే.
This post was last modified on July 4, 2026 5:11 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…