టికెట్లు కొనిపిస్తున్న విజువల్ ఎఫెక్ట్స్

నిన్న విడుదలైన సినిమాల్లో నాగబంధంకే రివ్యూలు, సోషల్ మీడియా టాక్స్ ఎక్కువ నెగటివ్ కనిపించాయి. కానీ అనూహ్యంగా గ్రౌండ్ లెవెల్ పరిస్థితి వేరేలా ఉంది. ట్రైలర్ తాలూకా ఇంపాక్ట్ ఇప్పుడు కనిపిస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన డివోషనల్ డ్రామా కావడంతో ఆడియన్స్ ఒకసారి చూద్దామని డిసైడ్ అయిపోయి థియేటర్లకు వెళ్తున్న వైనం స్పష్టం. శని ఆదివారాలు కూడా ట్రెండ్ బాగానే ఉండబోతోంది. బుక్ మై షోలో 68 వేల టికెట్లతో డామినేషన్ ఈ సినిమాదే ఉంది.

పోటీగా వచ్చిన రావు బహదూర్ మీద పాజిటివిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా వెనుక ఉండటం గమనించాల్సిన విషయం. అది ఎక్స్ పరిమెంట్ మూవీ కావడంతో సాధారణ జనాలు వెంటనే వెళ్లడం లేదు. నాగబంధం ఏకంగా 3 గంటల 16 నిమిషాల నిడివి ఉండటం టాక్ మీద ప్రభావం చూపిస్తున్న మాట వాస్తవం. కంటెంట్ పరంగా ఎన్ని కంప్లయింట్స్ ఉన్నా లెన్త్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సింది. కనీసం అరగంట ట్రిమ్ చేసే ఛాన్స్ ఉంది.

ఈ దూకుడు నాగబంధం ఎప్పటిదాకా చూపిస్తుందనేది సోమవారానికి తెలుస్తుంది. ఆ రోజు నమోదయ్యే ఆక్యుపెన్సీలని బట్టి ఎక్కడ ఆగుతుందనేది అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు అభిషేక్ నామా హ్యాండిల్ చేసిన విధానం బెటర్ గా ఉండి ఉంటే నాగబంధం పెద్ద సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండేది. హీరో విరాట్ కర్ణకు ఎలాంటి ఇమేజ్, మార్కెట్ లేకపోయినా కేవలం జానర్ చూసి ఇంత పెద్ద మొత్తం పబ్లిక్ వస్తున్నారంటే ఇది తేలిగ్గా తీసుకునే విషయం కాదు.

ప్రస్తుతానికి బాక్సాఫీస్ డీసెంట్ గానే కనిపిస్తోంది. మా ఇంటి బంగారం రేంజ్ లో ఊపు లేదు కానీ ఉన్నంతలో థియేటర్ల వద్ద సందడి నెలకొంది.. బాలీవుడ్ మూవీ అల్ఫాకి దారుణమైన టాక్ రావడంతో నిన్న ఓ మోస్తరుగా ఉన్న ఓపెనింగ్ ఇవాళ పడిపోయేలా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు గంటకు కేవలం పదిహేను వందల టికెట్లు పోతున్నాయి. బడ్జెట్, క్యాస్టింగ్ పరంగా చూసుకుంటే ఇది చాలా చిన్న మొత్తం. భారీ డిజాస్టర్ దిశగా వెళ్తోందని చెప్పడానికి ఇదే సంకేతం.