
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది అనే ఒక టాక్ ఎప్పటినుంచో ఉంది. మాగ్జిమం ఐదు లేదా పదేళ్లు టాప్ లో ఉంటేనే గొప్ప విషయం అనుకునే రోజులు ఇవి. కానీ ఈ అంచనాలను పూర్తిగా బ్రేక్ చేస్తూ రెండు దశాబ్దాలుగా తన మార్క్ మెయింటైన్ చేస్తోంది సీనియర్ బ్యూటీ త్రిష కృష్ణన్. నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోవడం నిజంగా గొప్ప విషయమే.
ఈ ఏజ్ కి వచ్చేసరికి చాలామంది హీరోయిన్లు క్యారెక్టర్ రోల్స్ వైపు షిఫ్ట్ అయిపోతుంటారు. కానీ త్రిష మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోల పక్కన మెయిన్ లీడ్ ఛాన్సెస్ దక్కించుకుంటూ యంగ్ జనరేషన్ కి గట్టి పోటీ ఇస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభరలో త్రిషనే హీరోయిన్ కావడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. పెద్ద సినిమాల్లో ఆఫర్లు అందుకోవడమే కాకుండా, తన గ్లామర్ డోస్ ని కూడా నెక్స్ట్ లెవెల్ లో మెయింటైన్ చేస్తోంది.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో త్రిష షేర్ చేస్తున్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ శారీ లుక్ నుంచి మోడరన్ వెస్ట్రన్ వేర్ దాకా దేనికైనా తనే పర్ఫెక్ట్ ఛాయిస్ అన్నట్లుగా కనిపిస్తోంది. లేటెస్ట్ గా త్రిష తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. ఆ ఫొటోల్లో ఆమె లుక్స్, ఫిట్ నెస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. వయసు పెరుగుతున్నా కొద్దీ ఆమెలో చార్మ్ ఇంకా పెరుగుతోందే కానీ అస్సలు తగ్గట్లేదు.
ప్రస్తుతం ఈ సీనియర్ బ్యూటీ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. టాలీవుడ్ లో విశ్వంభరతో పాటు, మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన రామ్ అనే పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఇవే కాకుండా కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేస్తున్న ఒక భారీ మల్టీస్టారర్ లో కూడా త్రిష పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇలా వరుసగా పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టడం త్రిషకే సాధ్యమవుతుంది.
కేవలం సీనియర్ హీరోలకే కాకుండా, రీసెంట్ గా సూర్య సరసన కరుప్పు లాంటి సినిమాల్లో నటించి ఇప్పటి జనరేషన్ కి కూడా త్రిష ఫేవరెట్ గా మారిపోయింది. స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా ఇప్పటికీ ఆమెకు తిరుగులేదని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. తన లుక్స్ అండ్ యాక్టింగ్ తో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవ్వడం వల్లే డైరెక్టర్లు సైతం పెద్ద సినిమాల కోసం ఆమె వైపే మొగ్గు చూపుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సీనియర్ స్టార్ హీరోయిన్ తన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో చూడాలి.

Gulte Telugu Telugu Political and Movie News Updates
