అక్కినేని అఖిల్‌ను పెద్ద స్టార్‌ను చేసేస్తుందని అభిమానులు ఆశించిన సినిమా.. ఏజెంట్. నిర్మాత అనిల్ సుంకర సైతం రిలీజ్‌కు ముందు ఇదే మాట అన్నారు. తీరా చూస్తే టాలీవుడ్ చరిత్రలోనే అది అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఐతే సినిమా రిలీజైన కొంత కాలానికి అనిల్ సుంకర స్వరం మారింది.
ఈ సినిమా ఫెయిల్యూర్‌కు కారణాలు విశ్లేషిస్తూ, బౌండ్ స్క్రిప్టు లేకుండా టీం షూటింగ్‌కు వెళ్లిన విషయాన్ని వెల్లడించారు. అదే సినిమా ఫెయిల్యూర్‌కు ప్రధాన కారణమన్నారు. ఐతే ఈ సినిమా రిలీజై మూడేళ్లు దాటిపోగా.. ఇప్పటిదాకా ఆ ఫెయిల్యూర్ గురించి మీడియా వాళ్లతో మాట్లాడే అవకాశం అఖిల్‌కు రాలేదు. ఇప్పుడు తన కొత్త చిత్రం లెనిన్ రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో తమిళ క్రిటిక్ భరద్వాజ్ రంగన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ ఏజెంట్ ఫలితం గురించి మాట్లాడాడు.
ఏజెంట్‌కు అలాంటి ఫలితం రావడం తీవ్ర నిరాశ కలిగించినట్లు చెప్పిన అతను.. బౌండ్ స్క్రిప్టు లేకుండా షూటింగ్‌కు వెళ్లడమే సినిమా ఫెయిల్యూర్‌కు కారణమన్న నిర్మాత అభిప్రాయంతో ఏకీభవించాడు. ఏజెంట్ మూవీది బౌండ్ స్క్రిప్టు కాదని.. షూటింగ్ మొదలయ్యే సమయానికి ప్రోగ్రెస్ అవుతున్న స్క్రిప్టు అని అఖిల్ వ్యాఖ్యానించాడు. కొన్ని సీన్లు తీయడం.. మధ్యలో స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేయడం.. మళ్లీ షూట్ చేయడం ఇలా జరిగినట్లు వెల్లడించాడు.
ఒక సినిమా మొదలవుతుంటే.. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, ఇతర టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరికీ స్క్రిప్టు మీద పూర్తి అవగాహన ఉండాలని.. అప్పుడే అందరూ ఏకతాటిపై నిలబడి సినిమా కోసం పని చేస్తారని.. అలా కాని పక్షంలో దర్శకుడి మదిలో ఏముందో వాళ్లకు అర్థం కాదని.. ఎవరికి అనిపించిన వెర్షన్లో వాళ్లు పని చేస్తూ పోతారని.. అప్పుడు ఔట్ పుట్ సరిగా రాదని.. ఏజెంట్ విషయంలో అదే జరిగిందని అఖిల్ అన్నాడు.
కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఆ ఫెయిల్యూర్‌కు ఫలానా వాళ్లు బాధ్యులు అని ఒకరి పేరు తాను చెప్పలేనని.. తాను కూడా ఆ ప్రాసెస్‌లో భాగం కాబట్టి ఫెయిల్యూర్ బాధ్యతను తాను కూడా సమానంగా తీసుకుంటానని అఖిల్ తేల్చాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
