Movie News

అఫిషియల్… తల్లి కాబోతున్న సమంత

మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్ వేదికగా తాను తల్లి కాబోతున్నానని సమంత అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానుల్లో ఆనందం మరింత రెట్టింపైంది.

గత కొన్ని రోజులుగా సమంత గర్భధారణపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ కార్యక్రమాల్లో ఆమె కనిపించిన తీరు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. తాజాగా ఆమె స్వయంగా ప్రకటించడంతో అన్ని సందేహాలకు తెరపడింది.

సక్సెస్ మీట్ లో మాట్లాడిన సమంత భావోద్వేగానికి లోనయ్యింది. తన సినీ ప్రయాణంలో ప్రతి దశలో అండగా నిలిచిన అభిమానులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన సమంత వారి ప్రేమ, మద్దతు ఎప్పటికీ మరవలేనిదని తెలిపింది.

మాతృత్వం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన అధ్యాయమని పేర్కొన్న సమంత.. ఈ అందమైన దశను పూర్తిగా ఆస్వాదించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే కొంతకాలం సినిమాలకు విరామం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

అయితే ఈ విరామం తాత్కాలికమేనని సమంత స్పష్టం చేసింది. త్వరలోనే కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తానని అభిమానులకు హామీ కూడా ఇచ్చింది.

ఒకవైపు మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుండగా, మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా సమంత కొత్త ఆనందాన్ని ఆహ్వానిస్తున్నారు. కెరీర్ విజయంతో పాటు మాతృత్వం వరంగా రావడంతో ప్రస్తుతం ఆమె జీవితంలో నిజమైన డబుల్ సెలబ్రేషన్ నెలకొంది.

This post was last modified on June 24, 2026 9:27 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

30 minutes ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

38 minutes ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

1 hour ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

3 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago