Movie News

పుట్టినరోజు సంబరం… జన నాయకుడి మౌనం

ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల సెలబ్రేషన్స్ ఘనంగా ఉన్నాయి. టివికె మంత్రులు ఏకంగా నవజాత శిశువులకు బంగారు గొలుసులు కానుకగా ఇచ్చారు. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంబరం వేరే ఉంది. అదే జన నాయకుడు విడుదల తేదీ. మాములుగా అయితే అర్ధరాత్రి ఏదో ఒక అప్డేట్ ఇచ్చి ఉండాల్సింది. కానీ అదేమీ కెవిఎన్ హ్యాండిల్ లో లేదు.

సెన్సార్ చిక్కుల్లో పడిన జన నాయకుడు రివైజింగ్ కమిటీకి వెళ్లిన తర్వాత కూడా ఇంత ఆలస్యం జరగడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. విజయ్ కు దీని మీద ఆసక్తి పోయిందని, అందుకే చొరవ తీసుకోవడం లేదనే ప్రచారం చెన్నై వర్గాల్లో ఊపందుకుంది. నిర్మాత కూడా డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్ వెనక్కు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా వస్తున్న వార్తలు లేనిపోని అయోమయానికి దారి తీస్తున్నాయి.

ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య జన నాయకుడు టీమ్ కనీసం ఒక కొత్త పోస్టర్ వదలకపోవడం ఆడియన్స్ లో కొత్త అనుమానాలు రేపుతోంది. ఆల్రెడీ పూర్తి సినిమా పైరసీ బారిన పడి నానా ఇబ్బందులు చవి చూసింది. అయినా సరే వాటి లింక్స్ తీయించడం ద్వారా డ్యామేజ్ అయితే తగ్గించారు కానీ లక్షలాది మంది అప్పటికే చూసేశారు. జరిగిందేదో జరిగిందని ఇప్పుడు రిలీజ్ చేసినా తమిళనాడులో భారీ ఓపెనింగ్స్ తో మంచి రెవిన్యూ వచ్చి డిస్ట్రిబ్యూటర్లు లాభపడటం ఖాయం.

మరి ప్రొడక్షన్ వైపు నుంచి సమస్య పరిష్కారానికి ఎందుకు చొరవ తీసుకోవడం లేదనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. జన నాయకుడు లాగే పరాశక్తి కూడా జనవరిలో సెన్సార్ సమస్యల్లో పడితే తక్కువ రోజుల్లో దాన్నుంచి బయట పడింది. ఇప్పుడు ఏకంగా విజయ్ రూలింగ్ పార్టీ సిఎంగా ఉన్నా కూడా జన నాయకుకు అంతకంతా లేటవుతూనే ఉండటం ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది. భగవంత్ కేసరి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే, మమిత బైజు, బాబీ డియోల్ ప్రధాన తారాగణం.

This post was last modified on June 22, 2026 4:08 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

1 hour ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

5 hours ago