నందమూరి వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడు? టాలీవుడ్ లో గత పదేళ్లుగా నలుగుతున్న అతిపెద్ద ప్రశ్న ఇది. లేటెస్ట్ గా మోక్షజ్ఞ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తెల్లటి సంప్రదాయ దుస్తుల్లో స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఈ నందమూరి వారసుడిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. అయితే ఈ ఫోటోలు చూసిన తర్వాత ఆయన సినిమాల్లోకి రావడంపై ఇండస్ట్రీ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
ఈ లేటెస్ట్ ఫోటోల్లో మోక్షజ్ఞ ఫిజిక్ గమనిస్తే ఆయన ఇంకా పూర్తిగా సినిమాకు తగ్గట్టుగా మేకోవర్ కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో బరువు తగ్గి సన్నబడ్డారని, హీరోగా లాంచ్ అవ్వడానికి పక్కాగా రెడీ అయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన పిక్స్ చూస్తే లుక్స్ పరంగా కెమెరా ముందుకు రావడానికి ఆయనకు ఇంకాస్త సమయం పట్టేలానే కనిపిస్తోంది. దీంతో అసలు డెబ్యూ ఇప్పట్లో ఉంటుందా లేదా అనే కన్ఫ్యూజన్ అందరిలో మొదలైంది.

నిజానికి గతంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఉండబోతోందని మేకర్స్ నుంచి ఒక అధికారిక పోస్టర్ కూడా వదిలారు. ఇక అంతా సెట్ అయిపోయిందని ఫ్యాన్స్ సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా బయటకు రాాలేదు. షూటింగ్ జరుగుతుందా, ఆగిపోయిందా, లేక కథలో మార్పులు చేస్తున్నారా అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు.
అప్పట్లో భారీగా హడావిడి చేసిన ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏమైందనేది ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ కోసం నందమూరి అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ప్రతి ఏడాది పండుగలకు లాంచింగ్ ఉంటుందని వార్తలు రావడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం ఒక రొటీన్ లాగా మారిపోయింది. దర్శకుల పేర్లు మారుతున్నాయి రూమర్స్ వస్తూనే ఉన్నాయి కానీ గ్రౌండ్ లెవెల్ లో వర్క్ జరగడం లేదు. ఇక లేటెస్ట్ లుక్ చూస్తుంటే ఈ సస్పెన్స్ కు ఇప్పట్లో తెరపడేలా లేదు. ఒకవేళ లాంచ్ చేయాలనే ప్లాన్ ఉంటే మాత్రం నందమూరి కాంపౌండ్ నుంచి ఒక సాలిడ్ క్లారిటీ వస్తేనే ఈ గందరగోళానికి చెక్ పడుతుంది.

Gulte Telugu Telugu Political and Movie News Updates