Movie News

సమంత ‘గోల్డు’ గిట్టుబాటు అవుతోంది

నిన్న విడుదలైన మా ఇంటి బంగారంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెయిన్ సెంటర్స్ థియేటర్లు దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు చేయగా బిసి కేంద్రాల ఆక్యుపెన్సీలు బాగున్నాయని ట్రేడ్ టాక్. కొత్త సన్నివేశాలు కలపడం వల్ల పెద్దికి అనూహ్యమైన ప్రయోజనం కలగకపోవడంతో కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు సామ్ మూవీ ఫస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. నిన్న మరో నాలుగు చిత్రాలు దీంతో పాటే రిలీజైనప్పటికీ అవేవీ సామ్ మూవీ దరిదాపుల్లో లేవు.

ట్రేడ్ టాక్ ప్రకారం మా ఇంటి బంగారం తొలి రోజు వసూళ్లు 12 కోట్లకు పైగానే వచ్చాయట. అమెరికాలో ఇప్పటికే ఏడున్నర లక్షల డాలర్లు దాటేసి వన్ మిలియన్ వైపు పరుగులు పెడుతోంది. ఈ లాంఛనం ఇవాళో రేపో జరిగిపోవడం ఖాయం. టాక్, రివ్యూస్ యునానిమస్ గా లేకపోయినా ఎవరూ బాలేదు అనకపోవడం సామ్ బృందానికి సానుకూలాంశంగా మారింది. ఈ వీకెండ్ పెద్ద నెంబర్లు నమోదు కావడం ఖాయమని డిస్ట్రిబ్యూటర్లు ఏకాభిప్రాయంతో ఉన్నారు.

థియేటర్ బిజినెస్ పరంగా చూసుకుంటే ఇప్పటికే యాభై శాతం రికవరీ పూర్తి చేసిన మా ఇంటి బంగారం మరోసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ బలమేంటో చూపించింది. కంటెంట్ లో కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ జనాన్ని కనీస స్థాయిలో మెప్పిస్తే చాలు వాళ్లే హిట్ చేసి పెడతారని ఓపెనింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం సమంత ఇమేజ్ వల్ల జరిగింది కాదు. ఎంచుకున్న జానర్, తీసుకున్న సబ్జెక్టు, చేసిన ప్రమోషన్లు ఆడియన్స్ లోకి బాగా చొచ్చుకువెళ్లాయి.

బాక్సాఫీస్ అంకెలు ఎక్కడిదాకా వెళ్తాయనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఆదివారం దాకా ఎలాగూ స్ట్రాంగ్ గా ఉంటుంది. వీక్ డేస్ లోనూ పట్టు కొనసాగిందంటే మాత్రం సూపర్ హిట్ దాటిపోవడం ఖాయం. కాంపిటేషన్ లో వచ్చిన ఇతర సినిమాలేవీ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసినవి కాకపోవడం మా ఇంటి బంగారంకు పెద్ద ప్లస్ గా మారుతోంది. అందులోనూ వచ్చే వారం రిలీజ్ కావాల్సిన లెనిన్ వాయిదా పడి జూలై 10కి వెళ్లిపోవడం సమంతకు మరింత కలిసి రానుంది.

This post was last modified on June 20, 2026 11:06 am

Share

Recent Posts

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

44 minutes ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

9 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

9 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

9 hours ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

13 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

13 hours ago