శ్రీముఖి భలే ఛాన్స్ పట్టేసింది

నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండో ఆర్టిస్ట్ స్నేహితురాలిగా నటించిన మంజూష ముక్కవిల్లి కాగా మూడో వ్యక్తి శ్రీముఖి. యాంకర్ గా మంచి జోష్, హుషారుతో ఎప్పుడూ బుల్లితెర మీద సందడి చేసే శ్రీముఖి అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది కానీ సిల్వర్ స్క్రీన్ తనకిచ్చిన గుర్తింపు తక్కువే. దక్కిన క్యారెక్టర్లు అలాంటివి కాబట్టి పాపులారిటీ రాలేదు.

అయితే మా ఇంటి బంగారంలో సమంత తోడి కోడలిగా ఫుల్ హోమ్లీ గెటప్ లో చిన్నపాటి అసూయ, అమాయకత్వం కలగలిసిన పాత్రలో శ్రీముఖి బాగా మెప్పించింది. ఫస్ట్ హాఫ్ లోనే ఎక్కువ కనిపించినప్పటికీ ఉన్నంతలో దర్శకురాలు నందిని రెడ్డి ఆమెను బాగా డిజైన్ చేశారు. పెర్ఫార్మన్స్ కూడా సెటిల్డ్ గా ఎక్కువ కేకలు, అరుపులు లేకుండా నీట్ గా నడిపించారు. తనకు సామ్ కు మధ్య సన్నివేశాలను లేడీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న వైనం థియేటర్లలో కనిపిస్తోంది.

దీని వల్ల శ్రీముఖికి పెద్ద బ్రేక్ దక్కుతుందనిని చెప్పలేం కానీ ఒక సపోర్టింగ్ ఆర్టిస్టుగా తనను ఎలా వాడుకోవచ్చో చెప్పడానికి మంచి రిఫరెన్స్ లా ఈ సినిమా ఉపయోగపడుతుంది. అసలే టాలీవుడ్ లో క్యారెక్టర్ నటీమణులు తగ్గిపోతున్నారు. సుధా, అన్నపూర్ణ, సీత, సితార లాంటి వాళ్ళు రొటీన్ అయిపోవడంతో పాటు ఏజ్ బార్ క్యాటగిరీలోకి వచ్చారు. సో శ్రీముఖిని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మా ఇంటి బంగారం తరహాలో మంచి అవకాశాలు ఇవ్వొచ్చు.

కమర్షియల్ గా ఈ మూవీ ఏ స్థాయికి వెళ్తుందనేది సోమవారానికి క్లారిటీ వస్తుంది కానీ ఇప్పటికైతే మంచి ఓపెనింగ్ దక్కింది. పెద్ది తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఏర్పడిన గ్యాప్ ని కేవలం రెండు వారాల వ్యవధిలో పూడ్చే సినిమా ఇదే అవుతుందని బయ్యర్లు నమ్మకంగా ఉన్నారు. దానికి తగ్గట్టే బుకింగ్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే విలన్ కన్నా ఎక్కువగా మా ఇంటి బంగారంలో శ్రీముఖి లాంటి లేడీ ఆర్టిస్టులకే పేరు గమనార్హం. తీసింది మహిళా దర్శకురాలు మరి.