తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు. భారీ చిత్రాలు, హిట్ టాక్ తెచ్చుకున్నవి కూడా పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవడం గగనం అయిపోతోంది.
ఒకప్పుడు వైభవం చూసిన దిల్ రాజు సైతం సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ కూడా తడబడుతూ సాగుతోంది. సితార నాగవంశీకి కూడా పరిస్థితులు అంతగా కలిసి రావడం లేదు. ఇలాంటి టైంలో అంతగా పాపులర్ కాని, మిడ్ రేంజ్ సినిమాలు చేసే ప్రొడ్యూసర్.. నిలకడగా సక్సెస్‌లు అందుకుంటూ దూసుకెళ్తున్నారు. అతనే.. షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి.
సాహుకు కొన్నేళ్లుగా భలే కలిసొస్తోంది. అతడికి అనిల్ రావిపూడి రూపంలో ఒక జాక్‌పాట్ లాంటి డైరెక్టర్ దొరికాడు. అతడితో అనుబంధం సాహుకు వరుసగా విజయాలందిస్తోంది. షైన్ స్క్రీన్స్‌లో బాాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ తీసి సాహుకు మూడేళ్ల ముందు పెద్ద విజయాన్నందించాడు అనిల్.
ఆ తర్వాత సాహు.. ‘కిష్కింధపురి’తో గత ఏడాది హిట్టు కొట్టాడు. ఈ ఏడాదైతే సాహు పట్టిందల్లా బంగారమే అన్నట్లుంది. మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ కెరీర్లోనే అతి పెద్ద విజయాన్నందించింది. ఈ చిత్రంలో భారీగా లాభాలందుకున్నాడు సాహు.
ఇక మలయాళంలో తక్కువ బడ్జెట్లో చేసిన ‘వాళా-2’ సెన్సేషన్ క్రియేట్ చేసి సాహుకు భారీ లాభం తెచ్చిపెట్టింది.
ఇప్పుడేమో వెంకీ, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రూపొందిస్తున్న కొత్త సినిమాను కూడా తన సంస్థలోనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు సాహు. ఈ సినిమా పెద్ద హిట్ అని ఇండస్ట్రీ ముదే ఫిక్స్ అయిపోయింది. సాహుకు మరో జాక్‌పాట్ ఖాయమని అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సాహులా మరే నిర్మాతా ఇంత నిలకడగా విజయాలు సాధించట్లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates