సరిగ్గా మూడో వారంలో అడుగు పెట్టిన సందర్భంలో పెద్దికి కొత్త సీన్లు జోడించారు. కొన్ని హైదరాబాద్ సింగల్ స్క్రీన్లలో నిన్న రాత్రి షోల నుంచే ఈ మార్పులు కనిపించగా ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి కొత్త వెర్షన్ చూడొచ్చు. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం ఆరు నిమిషాల ఫుటేజ్ కొత్తగా కలపగా తొలి రోజుల్లో అబ్జెక్షన్ వచ్చిన జాన్వీ కపూర్ సీన్లను తగ్గించేశారు. ముఖ్యంగా కుస్తీ పైల్వాన్ గెటప్ లో పెట్టిన పెళ్లి చూపుల సన్నివేశం థియేటర్లలో బాగా పేలేలా ఉంది.
కాకపోతే ఇదేదో ముందే చేయాల్సిందన్న కామెంట్స్ లో నిజం లేకపోలేదు. ఎందుకంటే పెద్ది ఇప్పటికే నాలుగు వందల కోట్ల మార్కు వైపు దూసుకువెళుతుంది. అభిమానులు ఆల్రెడీ రిపీట్ షోలు చూసేశారు. టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నా సరే కుటుంబ ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో మొదటి పది రోజుల్లోనే కానిచ్చేశారు. ఇప్పుడు కొత్త ఎపిసోడ్స్ కోసం అదే పనిగా మళ్ళీ వస్తారన్న గ్యారెంటీ లేదు. వీర ఫ్యాన్స్ సంగతేమో కానీ సగటు జనాలు కేవలం వీటి గురించే టికెట్లు కొనడం ఉండదు.
సరే ఏదైతేనేం నిదానమైనా మంచి పనే చేశారనుకోవాలి. ఇంకా పెద్దిని చూడని జనాల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. ముఖ్యంగా మూడో వీకెండ్ చాలా కీలకం కానుంది. అన్ని చోట్ల సాధారణ టికెట్ రేట్లే ఉంటాయి కాబట్టి ఆదివారం కలెక్షన్లు మళ్ళీ పెరిగే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కాకపోతే సమంత మా ఇంటి బంగారంతో పాటు కొత్త రిలీజులు మొత్తం అయిదు ఉన్నాయి. వీటికి బాలీవుడ్ మూవీ కాక్ టైల్ 2 అదనం. సో పెద్ది రన్ అంత సులభంగా అయితే ఉండదు.
ఓటిటి జూలై రెండో వారంలో జరిగే నేపథ్యంలో పెద్ది ఫైనల్ నెంబర్ ఎక్కడ ముగుస్తుందనేది వేచి చూడాలి. ఒక విషయంలో పెద్దికి తీవ్ర నిరాశ మిగిలింది. హిందీ వెర్షన్ పట్టుమని పాతిక కోట్లు తేలేకపోగా, ఓవర్సీస్ లో అయిదు మిలియన్ మార్క్ అందుకోవడం కష్టమైపోయింది. తమిళనాడు, కేరళలో తిరస్కారం తప్పలేదు. కర్ణాటకలో మాత్రమే ఊరట దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ దక్క బట్టి ఇక్కడి వరకు సూపర్ హిట్ అనిపించుకుంది. ఇంట గెలిచిన పెద్ది రచ్చ మాత్రం గెలవలేదు.
This post was last modified on June 18, 2026 1:02 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…