సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద విజయం అందుకున్నారో తెలిసిందే. వెంకీ పాత్ర ఎక్కువ నిడివి లేకపోయినప్పటికీ సెకండాఫ్ ని నిలబెట్టడంలో కీలక భూమిక వహించింది. అయితే ఇప్పుడీ ఫ్రెండ్స్ పరస్పరం బాక్సాఫిస్ వద్ద తలపడే పరిస్థితి వస్తుందా అంటే దాదాపు ఔననే సమాధానం వినిపిస్తోంది. క్లాష్ తప్పకపోవచ్చని ఇన్ సైడ్ టాక్.
వివరాల్లోకి వెళ్తే వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎంటర్ టైనర్ వచ్చే వారం నుంచి షూటింగ్ లోకి వెళ్లబోతోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతంలో ఆల్రెడీ మూడు పాటలు రికార్డింగ్ అయిపోయాయి. అన్నీ అనంత శ్రీరామ్ తోనే రాయించారు. మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేసేలా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2027 సంక్రాంతి డేట్ మిస్ కాకూడదనేది రావిపూడి సంకల్పం. పండగ హ్యాట్రిక్ ని ఘనంగా అందుకోవాలని తహతహలాడుతున్నాడు.
ఇక మెగా 158 మంచి స్పీడ్ తో ఉంది. పొల్లాచ్చి షెడ్యూల్ చకచకా పూర్తి చేసుకుని వచ్చారు. ఈ వారంలోనే రెండోది మొదలు కానుంది. దర్శకుడు బాబీ ప్రీ ప్లాన్డ్ గా ప్రీ ప్రొడక్షన్ చేసుకోవడం వల్ల పనులు వేగంగా అవుతున్నాయి. వాల్తేరు వీరయ్య తరహాలో సెంటిమెంట్ మరోసారి రిపీట్ చేస్తూ సంక్రాంతికి రావాలనే లక్ష్యంతో చిత్రీకరణ చేస్తున్నారట. టీమ్ వేగం చూస్తుంటే అదేమీ అసాధ్యం అనిపించడం లేదట. పైగా విఎఫ్ఎక్స్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాదు.
చిరంజీవి, వెంకీ ఇలా పరస్పరం తలపడటం కొత్తేమి కాదు. కాకపోతే ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా ఇది ఎవరికి రిస్క్ అవుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి. అడ్వాంటేజ్ ఏంటంటే రెండు వేర్వేరు జానర్లు. వెంకీ మూవీ వినోదం ప్లస్ యాక్షన్ తో ఉండగా. చిరంజీవి సినిమా సీరియస్ కంటెంట్ తో పాటు పీక్ ఎలివేషన్స్ ఉంటాయట. సో రెండూ వర్కౌట్ అయితే మంచిదే. ఒకవేళ బాలయ్య కూడా కొరటాల శివ సినిమాతో రేసులో దిగితే పోటీ రసవత్తరంగా మారుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates