ఎవ‌రా త‌ల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్?

హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్త‌య్యాక త‌ల్లెప్పుడు అవుతారు అంటూ ప్ర‌శ్న‌లు మొద‌ల‌వుతాయి. దీని మీద రూమ‌ర్ల‌కూ కొద‌వేమీ ఉండ‌దు. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక స్టార్ హీరోయిన్ త‌ల్లి కాబోతోంద‌న్న విష‌యం సినీ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ హీరోయిన్ ఎవ‌రు అన్న‌దాని మీద సోష‌ల్ మీడియాలో తెగ చ‌ర్చ‌లు జ‌రిగిపోతున్నాయి.

ఈ శుక్ర‌వారం మాఇంటి బంగారం సినిమా రిలీజ్ కానున్న నేప‌థ్యంలో ముందుగా స‌మంత మీదికి నెటిజ‌న్ల దృష్టి మ‌ళ్లింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల కోసం స‌మంత చీర క‌ట్టుకుని రాగా.. ప్రెగ్నెన్సీని క‌వ‌ర్ చేయ‌డానికే చీర‌లో వ‌చ్చిందంటూ కొంద‌రు అనుమానంగా చూడ‌డం మొద‌లుపెట్టారు. కానీ సినిమాలో పాత్రకు త‌గ్గ‌ట్లే చీర‌లో వ‌చ్చింది త‌ప్ప సామ్ గ‌ర్భ‌వ‌తి అనే వార్త‌ల్లో నిజ‌మేమీ లేద‌ని తెలుస్తోంది.

రాజ్ నిడిమోరుతో స‌మంత పెళ్లి జ‌రిగి ఏడాది కూడా కాలేదు. పైగా కెరీర్ మీద స‌మంత గ‌ట్టిగా ఫోక‌స్ చేసిన నేప‌థ్యంలో ఆమెకు ఇప్పుడే పిల్ల‌ల్ని క‌నే ఆలోచ‌న ఉందా అన్న‌ది సందేహ‌మే. మ‌రోవైపు తెలుగు వారికి ఎంతో చేరువైన మ‌ల‌యాళ భామ కీర్తి సురేష్ మీదా ప్రేక్ష‌కుల దృష్టి మ‌ళ్లుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమ‌లో ఉన్న త‌న కాలేజీ రోజుల‌ నాటి స్నేహితుడు ఆంటోనీని కీర్తి రెండేళ్ల ముందు పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

కెరీర్ మంచి ఊపులో ఉండ‌గానే పెళ్లి చేసుకుని స‌ర్ప్రైజ్ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు ఎక్కువ ఆల‌స్యం చేయ‌కుండా బిడ్డ‌ను క‌న‌డానికి రెడీ అయిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కీర్తికి తెలుగులో ఒక్క సినిమానే ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న రౌడీ జ‌నార్ధ‌న‌లో న‌టిస్తోంది. ఆ సినిమాలో త‌న‌ పోర్ష‌న్స్ ఎంత వ‌ర‌కు వ‌చ్చాయో కానీ.. ఇప్పుడు ఆమె గ‌ర్భం దాల్చిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి త‌ల్లి కాబోతున్న‌ట్లుగా వార్త‌ల్లో ఉన్న సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తియేనా ఇంకొక‌రా అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది.