కల్కి 2 కోసం ఆర్ఆర్ఆర్ సీత ?

ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ షూటింగ్ ప్రారంభమై రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. విడుదల ఈ ఏడాది కాకపోయినా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక ప్లానింగ్ ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయించడం కోసం డార్లింగ్ డేట్స్ కు అనుగుణంగా చిత్రీకరణ చేస్తున్నారు. వేరే ఆర్టిస్టులు మాత్రమే ఉండే ఎపిసోడ్స్ చాలా మటుకు తీశారని ఇన్ సైడ్ టాక్. ఇప్పుడో స్పెషల్ న్యూస్ వచ్చింది.

ఒక ముఖ్యమైన పాత్ర కోసం అలియా భట్ ని సంప్రదించినట్టు తెలిసింది. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ని ప్రేమించే సీతగా ఎంట్రీ ఇచ్చిన అలియాకు ఇక్కడ మంచి రిసెప్షన్ దొరికింది. తక్కువ నిడివే అయినా రామరాజు మరదలిగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు పడ్డాయి. తర్వాత టాలీవుడ్ నుంచి ఆఫర్లు వెళ్లాయి కానీ డేట్ల సమస్య వల్ల ఓకే చెప్పలేదు. అయితే నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన క్యారెక్టర్ చాలా ప్రత్యేకంగా అనిపించడంతో నో చెప్పడానికి మనసు రాలేదని ముంబై వర్గాల కథనం.

అఫీషియల్ గా ఏదీ ఇప్పుడప్పుడే ప్రకటించే ఉద్దేశంలో దర్శకుడు నాగ్ అశ్విన్ లేరు. సింగ్ గీతం ఈవెంట్స్ లో ఎవరైనా కల్కి 2 ప్రస్తావన తెస్తున్నా మొహమాటం లేకుండా స్కిప్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ నుంచి ముందు రెండు సినిమాలు రిలీజ్ కావాలి. ఫౌజీ డిసెంబర్ ని టార్గెట్ చేసుకోగా స్పిరిట్ మార్చికి రెడీ అవుతోంది. చెప్పిన టైంకి వస్తాయా లేవానేది పక్కనపెడితే అటెన్షన్ ముందు ఉండాల్సింది వీటి మీద. అందుకే కల్కి 2ని అతిగా హైలైట్ చేయరు.

ఇదంతా బాగానే ఉంది కానీ దీపికా పదుకునే స్థానంలో ఎవరు వచ్చారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సాయిపల్లవి కన్ఫర్మ్ అయ్యిందని ఆ మధ్య విశ్వసనీయ వర్గాలు చెప్పాయి కానీ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. నాగ్ అశ్విన్ ని అడిగినా నేరుగా సమాధానం చెప్పలేదు. రామాయణతో ప్యాన్ ఇండియా మార్కెట్ లో అడుగు పెడుతున్న సాయిపల్లవికి కల్కి 2 ఖచ్చితంగా మంచి ఛాయస్ అవుతుంది. ఇలాంటి ఇంటరెస్టింగ్ కాంబోలు కల్కి 2లో చాలా ఉన్నాయట.