Movie News

ఓదెల ‘మెగా’ ప్రాజెక్టు… స్ట్రాటజీ మార్చాల్సిందే

భోళా శంకర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ ని మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ దాదాపుగా పూడ్చేసింది. అయితే ఒకప్పటిలా చిరంజీవి ఎక్కువ బ్రేక్స్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. వీలైనంత వేగంగా సినిమాలు చేస్తూ నెంబర్ పెంచుకోవాలని చూస్తున్నారు. ఒకరకంగా ఈయనతో పాటు బాలయ్య, నాగ్, వెంకీలు కౌంట్ పరంగా ఇస్తున్న కాంపిటీషన్ యూత్ హీరోలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంత ప్లాన్డ్ గా ఉన్నా సరే విశ్వంభర ఆలస్యం చిరుతో పాటు అభిమానులను ఇరిటేట్ చేసింది.

అందుకే ఇకపై ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకుంటున్నారు చిరు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 158 కేవలం వంద వర్కింగ్ డేస్ లో పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నారట. అదే నిజమైతే 2027 సంక్రాంతి బరిలో మెగాస్టార్ మూవీ ఉంటుంది. విశ్వంభరని దసరా పండగ కానుకగా విడుదల చేసే ప్రణాళిక ప్రతిపాదన స్టేజిలో ఉంది. సరే ఇదంతా బాగానే ఉంది కానీ చిరు నెక్స్ట్ చేయాల్సిన సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో అన్న సంగతి తెలిసిందే.

న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా ఎప్పుడో ఈ కాంబో అధికారికంగా ప్రకటించారు. అయితే నాని లాంటి వయసులో ఉన్న కో ఆపరేటివ్ హీరోతోనే ఇంత ఆలస్యం చేస్తున్న శ్రీకాంత్ ఓదెల మరి చిరంజీవి విషయంలోనూ ఇలాగే చేస్తే ఇబ్బందులు తప్పవు. ప్యారడైజ్ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. విడుదల తేదీలు మారుతూనే ఉన్నాయి. ఆరు నూరైనా ఆగస్ట్ 21 పక్కా అన్నారు. కానీ మాట మీద నిలబడలేదు. ఇప్పుడు సెప్టెంబర్ అంటున్నారు కానీ దానికీ గ్యారెంటీ లేదు.

ఈ పోస్ట్ పోన్లతో నాని కొంత అసహనంగా ఉన్నాడని ఇన్ సైడ్ టాక్. దర్శకుడు సుజిత్ బ్లడీ రోమియో కన్నా ముందు ఓజి 2 చేయాలని నిర్ణయించుకోవడం వెనుక కారణం ఇదేనంటున్నారు. చిరంజీవితో నిజంగా శ్రీకాంత్ ఓదెల సినిమా తీసే పనైతే ఆరేడు నెలల్లో గుమ్మడికాయ కొట్టేలా చూసుకోవాలి. అంతే తప్ప సంవత్సరాల తరబడి తీస్తానంటే చాలా సమస్యలు వస్తాయి. ప్యారడైజ్ రిలీజైన వెంటనే మెగా మూవీకి సంబంధించిన క్లారిటీ వీలైనంత వేగంగా ఇస్తే బెటర్.

This post was last modified on June 14, 2026 5:10 pm

Share

Recent Posts

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

1 hour ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

2 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

3 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

4 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

4 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

6 hours ago