గీత రచయిత అనంత శ్రీరామ్ కు కోపం వచ్చేసింది. ఘాటుగా కాకపోయినా మాములుగా మాట్లాడుతూనే లేనిపోని విమర్శలకు తావు ఇచ్చినట్టయ్యింది. ఐటెం సాంగ్ గురించి మీడియా నుంచి ప్రశ్న ఎదురైనప్పుడు ఆయన మాట్లాడుతూ సాహిత్య విలువలు తెలిసినవాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళతో సమస్య లేదని, వాళ్ళు ఏది అడిగినా నిఖార్సైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ స్టేట్ మెంట్ లో ఎలాంటి ఇబ్బంది లేదు. మంచిది కూడా.
అయితే ఐటెం సాంగ్ ఆస్వాదించలేని వాళ్ళు ఐటెంగాళ్ళు అని నేరుగా ప్రేక్షకులను ఉద్దేశించి అనడం మాత్రం భావ్యం కాదు. ఎందుకంటే ప్రేక్షకులు అన్నాక రకరకాల వర్గాలు ఉంటాయి. ఇష్టపడే రకం, వ్యతిరేకించే వర్గం అందరిని అంగీకరించాలి. అంతెందుకు పుష్పని నెత్తిన బెట్టుకున్న ఉత్తరాది జనాలు ఇప్పుడు పెద్దికి పాతిక కోట్లు ఇవ్వలేకపోయారు. అలాని బాలీవుడ్ జనాలను మీకు సినిమా చూడటం చేతకాదని అనలేం కదా. తమిళంలోనూ పెద్దికి తిరస్కారం ఎదురయ్యింది.
ఇక పాట విషయానికి వస్తే రోజుకి ఇరవై కూలి సంపాదించే వాడిని ఉద్దేశించి వారానికి వెయ్యి దాయి నీకిస్తా హాయి అనడంలో ఎలాంటి సాహిత్యాన్ని వెతుక్కోవాలో వివరించాలని కొందరు సోషల్ మీడియాలో నిలదీసిన మాట వాస్తవం. ఆ ప్రశ్నలో లాజిక్ ఉంది. ఇది అడిగేందుకు ఎంఏ లిటరేచర్ చదివి రావాల్సిన అవసరం లేదు. వింటే చాలు. ఎవరికో నచ్చలేదు, మంచిది అంటే అయిపోతుంది. ఒకవేళ పబ్లిక్ రివర్స్ ఇలాంటిది రాసినోళ్లు అంటూ అదే భాషలో రివర్స్ కౌంటర్ వేస్తే ఏం చెబుతాం.
ఇది పక్కన పెడితే అనంత్ శ్రీరామ్ కొన్ని మంచి విషయాలు కూడా మాట్లాడారు. పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర మీద విమర్శలు, బుచ్చిబాబు క్షమాపణ చెప్పడం నచ్చలేదని ప్రస్తావిస్తూ వేరే సినిమాల్లో ఇంకొకళ్ళు హార్మోన్స్ గురించి మాట్లాడుతూ డైలాగులు పెడితే అది కల్ట్ మేకింగ్ అంటామని, అదే ఒక పల్లెటూరి హీరో ముట్టుకోవాలని వాడి భాషలో అంటే బూతు అయిపోయిందని చురక వేశారు. మొత్తానికి ఇటు పాజిటివ్ అటు నెగటివ్ రెండు రకాలుగా శ్రీరామ్ గారు హాట్ టాపిక్ అవ్వడం గమనార్హం.
This post was last modified on June 14, 2026 4:57 pm
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…