Movie News

10 సార్లు పెద్దిని చూసేందుకు టోక్యో నుంచి హైదరాబాద్ కు

అభిమానం ఎంత పని అయినా చేసేలా చేస్తుందని చెబుతారు. అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది ఇప్పుడు చెప్పే ఇద్దరు జపాన్ మహిళల ఉదంతం. ఈ ఇద్దరు జపనీస్ మహిళలకు రాంచరణ్ అంటే మహా ఇష్టం. డైహార్ట్ ఫ్యాన్స్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు.

మగధీర సినిమా నుంచి రాంచరణ్ ను విపరీతంగా అభిమానించే వీరు.. గత ఏడాది రాంచరణ్ ను చూసేందుకు జపాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. తాజాగా రిలీజ్ అవుతున్న పెద్ది మూవీని చూసేందుకు వారు ఇప్పుడు మరోసారి హైదరాబాద్ కు వచ్చారు.

జపాన్ లో పెద్ది సినిమా విడుదల లేకపోవటం.. రిలీజ్ రోజే.. ఆ మాటకు వస్తే ప్రత్యేకంగా వేసే ఫ్యాన్స్ షోలో పెద్ది సినిమాను.. తమలా రాంచరణ్ ను అమితంగా ఆరాధించే ఫ్యాన్స్ తో కలిసి చూసేందుకు తాజాగా టోక్యో నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు జపాన్ కు చెందిన మసామీ.. క్రిస్. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే వీరికి జపనీస్ తప్పించి మరే భాష తెలియదు. అందుకే.. తెలుగు తెలిసిన తమ స్నేహితురాలు కన్మణి తో జపాన్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు.

తెలుగు సినిమాల విడుదల వేళ.. అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. నిలువెత్తు కటౌట్లు.. భారీ ఎత్తున పాలాభిషేకాలు మొదలు.. బాణసంచా కాల్చటం లాంటివెన్నో ప్లాన్ చేస్తారు. ఆ విషయాల్ని తెలుసుకున్న ఈ ఇద్దరు జపాన్ మహిళలు.. పెద్ది సినిమాను హైదరాబాద్ లో చూడాలని డిసైడ్ కావటం విశేషం. వాస్తవానికి వారు సింగపూర్ వెళ్లి పెద్ది సినిమా చూడాలని ప్లాన్ చేసినా.. తెలుగు సినిమా హీరోలకు సంబంధించి.. ఆయా ఫ్యాన్స్ వారు చేసే సందడి గురించి తెలుసుకున్న వారు.. ఆ వైబ్ ను నేరుగా ఫీల్ అయ్యేందుకు రావటం విశేషం.

మూడు రోజుల వ్యవధిలో బ్యాక్ టు బ్యాక్ పది సార్లు పెద్ది సినిమా చూడాలని వారు ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. పెద్ది సినిమా కోసం వారు వ్యక్తిగతంగా దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు చేసేందుకు వెనుకాడకపోవటం విశేషం. అలా అని వారేమీ సంపన్నులు కాదు.

పెద్ది సినిమా రిలీజ్ రోజున హైదరాబాద్ లో చూసేందుకు.. అదనపు గంటలు పని చేసి.. అలా వచ్చిన డబ్బుల్ని దాచుకొని మరీ హైదరాబాద్ కు వచ్చిన తీరు గురించి తెలిస్తే.. రాంచరణ్ మీద ఇంత అభిమానమా? అని ఆశ్చర్యపోవాల్సిందే. మరి.. ఇంత శ్రమపడి వచ్చారు కదా? మీ అభిమాన కథానాయకుడ్ని కలుస్తారా? అంటే.. సినిమా విడుదల వేళ ప్రమోషన్లతో బిజీగా ఉంటారని.. అలాంటప్పుడు ఆయన్ను ఇబ్బంది పెట్టకూడదని తాము భావిస్తున్నట్లుగా వారు చెప్పటం విశేషం.

This post was last modified on June 3, 2026 6:49 pm

Share

Recent Posts

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

20 minutes ago

ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

1 hour ago

విజయదశమి క్లాష్… ‘పంచతంత్ర’ పోటీ

ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…

2 hours ago

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

12 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

13 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

13 hours ago