ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి. ఇప్పటిదాకా ఆయన పని చేసిన టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ ఏవీ బ్లాక్ బస్టర్లు కాలేదు. సూపర్ పోలీస్ నుంచి కొమరం పులి దాకా ఏది తీసుకున్నా ఫ్లాపే. ఏ మాయ చేశావే ప్రాథమికంగా తమిళంతో పాటు సమాంతరంగా తీసిన తెలుగు సినిమా కాబట్టి కౌంట్ లోకి రాదు కానీ ఆయన స్థాయికి కంపోజింగ్ మనవరకు జరగలేదన్నది వాస్తవం.
పెద్ది రూపంలో ఆయన పెద్ద సవాల్ స్వీకరించారు. ఇప్పుడున్నది ఎలివేషన్ల జమానా. అనిరుధ్ రవిచందర్, రవి బస్రూర్, తమన్, అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్, దేవిశ్రీ ప్రసాద్ మొదలైనవాళ్లంతా బీజీఎమ్స్ తో కంటెంట్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసి ఎన్నో బ్లాక్ బస్టర్లో భాగం పంచుకున్నారు. జైలర్, దేవర లాంటివి కేవలం ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ వింటూ గడిపేసే మ్యూజిక్ లవర్స్ ఉన్నారు. చెప్పాలంటే జెన్ జీ జనరేషన్ ఆడియన్స్ చాలా డిఫరెంట్.
అసలే పెద్ది స్పోర్ట్స్ డ్రామా ప్లస్ హెవీ ఎమోషన్ ఉన్న కంటెంట్. కమర్షియల్ వాల్యూస్ పుష్కలంగా ఉన్నాయి కానీ వాటిని సరైన రీతిలో జనాలకు కనెక్ట్ చేసే నేపధ్య సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. ట్రైలర్ లో రెహమాన్ మేజిక్ అంత తీవ్రంగా అనిపించలేదు కానీ ఫైనల్ అవుట్ ఫుట్ లో మాత్రం వేరే లెవెల్ ఉంటుందని యూనిట్ చెబుతోంది. దర్శకుడు బుచ్చిబాబు వెలిబుచ్చుతున్న నమ్మకం కూడా అదే స్థాయిలో ఉంది. సో ఇది నిజమైతే జెన్ జీకి మరో మ్యూజిక్ గాడ్ దొరికినట్టే.
దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఉంది. ఒకప్పుడు రోజా, బొంబాయి, భారతీయుడు, ప్రేమదేశం లాంటి ఎన్నో ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చిన రెహమాన్ గత పదిహేనేళ్లుగా తన స్థాయి మ్యూజిక్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు టీనేజర్స్ గా ఉన్న కుర్ర బ్యాచ్ ని అంతగా మెప్పించలేకపోతున్నారు. కానీ చికిరి చికిరి దాన్ని మాయం చేసే దిశగా చార్ట్ బస్టర్ అయ్యింది. రైరై రారయ్ దాన్ని బలపరిచింది. ఇప్పుడు పూర్తి సినిమా మెప్పించడమే తరువాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates