తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా అంటే ఓకే కానీ.. అంతకుమించి గ్యాప్ ఉంటే ఇబ్బంది తప్పదు. టాలీవుడ్ నెక్స్ట్ రిలీజ్ ‘పెద్ది’కి ఏపీలో ముందు రోజు రాత్రి 8 గంటలకే పెయిడ్ ప్రిమియర్స్ వేసుకోవడానికి అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. ఈ షోలకు రూ.600 రేటు కూడా పెట్టారు.
ఐతే తెలంగాణలోనూ ప్రిమియర్స్ వేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీలో మాదిరే ఇక్కడా రూ.600 రేటు పెట్టాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ అదనపు రేట్ల విషయంలో కోర్టు కేసుల కారణంగా అనుమతులు తెచ్చుకోవడం కష్టమవుతోంది. అదనపు రేట్లకు అవకాశం లేకపోతే అసలు పెయిడ్ ప్రిమియర్స్ వేయాలా వద్దా అనే సందిగ్ధంలో చిత్ర బృందం ఉంది.
తెలంగాణలో ‘పెద్ది’ రేట్ల జీవో కోసం చిత్ర బృందం ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. ఏపీలో మాత్రం బుకింగ్స్ మొదలైపోయాయి. ముందు రెగ్యులర్ షోలకు బుకింగ్స్ మొదలుపెట్టి.. తెెలంగాణలో పెయిడ్ ప్రిమియర్స్ ఉంటాయా లేవా అన్నదాన్ని బట్టి జూన్ 3న షోల సంగతి తేలుస్తారేమో అనుకుంటే.. అక్కడ అలా ఏమీ ఎదురు చూడలేదు.
పెయిడ్ ప్రిమియర్స్‌కు రేటు ఎక్కువ, వాటి ద్వారా ఆదాయం ఎక్కువ వస్తుంది. పైగా రెగ్యులర్ షోలకు బుకింగ్స్ పెడితే, ప్రిమియర్స్ టికెట్లు వేగంగా అమ్ముడు కావు. కాబట్టి థియేటర్లు వాటికే ముందు బుకింగ్స్ మొదలుపెట్టాయి. వాటికి రెస్పాన్స్ బాగానే ఉంది.
ఏపీలో రెగ్యులర్ షోలకు బుకింగ్స్ కొంచెం లేటుగా ఓపెన్ చేయబోతున్నారు. ఈ షోలకు పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో పెయిడ్ ప్రిమియర్స్ టికెట్లు అందుబాటులోకి రావడంతో తెలంగాణలో ఫిలిం లవర్స్‌లో టెన్షన్ పెరిగిపోతోంది.
ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రిమియర్స్ కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి గురించి చెప్పాల్సిన పని లేదు. ఐతే ఈ రోజు రాత్రి టికెట్ హైక్స్ జీవో రాకపోతే రెగ్యులర్ రేట్లతోనే ప్రిమియర్స్ సహా అన్ని షోలకూ బుకింగ్స్ మొదలుపెట్టేస్తారని వార్తలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates