పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8 గంటలకు ఒక షో వేసుకొచ్చని చెప్పేశారు. ఆ తర్వాత పది రోజుల పాటు రోజుకు 5 షోలకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. సింగల్ స్క్రీన్ లో 100, మల్టీప్లెక్స్ లో 125 రూపాయలు చొప్పున ప్రతి టికెట్ మీద అదనంగా తీసుకునే వెసులుబాటు ఇచ్చారు. జూన్ 13 దాకా పెద్ది చూడాలంటె ఏపీ ప్రేక్షకులు ఇంత మొత్తం చెల్లించక తప్పదు. ఇది వన్ సైడ్ స్టోరీ.
అసలు సమస్య తెలంగాణ వైపు ఉంది. ఇప్పటిదాకా ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు రాలేదు. కోర్టులో ప్రత్యేక పిటీషన్ వేసిన పెద్ది టీమ్ దాన్ని వెనక్కు తీసుకుంది. వాయిదా జూన్ 6 పడటంతో అప్పుడు అనుమతులు వచ్చినా లాభం ఉండదు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ పెంపుకి అనుకూలంగా ఉందనే వార్తలు ఇంకోవైపు వినిపిస్తున్నాయి. ఇది నిజమా కాదానేది ఆదివారం రాత్రికి క్లారిటీ రావొచ్చు. ఇంకోవైపు నైజామ్ లో ముందు రోజు రాత్రి రెండు ప్రీమియర్లు వేయాలనే ప్లాన్ లో వృద్ధి ఉన్నట్టు వినికిడి.
అలా చేస్తే సేఫ్ అవుతుందానేది ఫ్యాన్స్ మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇందులో రిస్క్ లేకపోలేదు. ఒక స్క్రీన్ లో రెండు బెనిఫిట్ షోలు వేయాలంటే ఒకటి సాయంత్రం ఏడు లేదా ఎనిమిదికి మొదలుపెట్టాలి. టాక్ త్వరగా బయటికి వస్తుంది. అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా తర్వాత షో మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అలా కాకుండా సింగల్ షోకి పరిమితం చేస్తే నెక్స్ట్ డేకి జనం ఎక్కువగా వెళ్లే అవకాశాలు పెరుగుతాయి. ఈ క్యాలికులేషన్ చాలా ముఖ్యం.
కంటెంట్ మీద చాలా ధీమాగా ఉన్న మేకర్స్ పెద్దికి కనక ఛాన్స్ దొరికితే అన్ని చోట్ల రెండు షోలు వేయాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఆరు వందల టికెట్ రేట్ ఏపీ ఆల్రెడీ ఇచ్చేయగా తెలంగాణలో అంతే మొత్తానికి పర్మిషన్ కనక దొరికితే అంత కన్నా గోల్డెన్ ఛాన్స్ మరొకటి ఉండదు. టాక్ రావడం ఆలస్యం పుష్ప 2 రేంజ్ లో ట్రెండింగ్ వచ్చేస్తుంది. జూన్ 1 విజయవాడలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత హైప్ మరింత పెరుగుతుందని అంటున్నారు. చూడాలి ఏం చేయబోతున్నారో.
This post was last modified on May 30, 2026 5:59 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…