జూన్ 4 దగ్గరికొస్తోంది. ముందు రోజు ప్రీమియర్లు దాదాపు ఖరారైపోయినట్టే. రెండు ప్రభుత్వాల నుంచి అనుమతులు వస్తే షోలు ప్రకటించడానికి టీమ్ సిద్ధంగా ఉంది. ప్రమోషన్లు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ముంబై ట్రైలర్ లాంచ్ సక్సెస్ కాగా భోపాల్ ఈవెంట్ మంచి రీచ్ తెచ్చుకుంది. బెంగళూరు ప్రెస్ మీట్ కొంచెం హడావిడిగా ముగిసింది. ఢిల్లీలో జ్యుక్ బాక్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలలో తాజాగా జగపతిబాబు అందుబాటులోకి వచ్చారు.
లెజెండ్ తర్వాత తనకు బెంచ్ మార్క్ గా అనిపించిన సినిమాలు అయిదారు మాత్రమే ఉన్నాయని వాటిలో పెద్ది అగ్ర స్థానాన్ని తీసుకుంటుందని జగపతి బాబు చెప్పిన మాటలు ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. చాలా డెప్త్, ఎమోషన్స్ తో పాటు పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే ఇలాంటి పాత్ర చేయడం, బుచ్చిబాబు లాంటి దర్శకుడితో పని చేయడం గురించి ఆయన చాలా గొప్పగా చెబుతున్నారు. రామ్ చరణ్ మీద పొగడ్తల వర్షం కురిపించడం వైరల్ అవుతోంది.
ఇంత ప్రత్యేకంగా జగపతిబాబు ఎలివేషన్ ఇవ్వడం వెనుక కారణం లేకపోలేదు. పెద్దిలో ఆయన పోషించిన అప్పలసూరి పాత్ర ఫస్ట్ హాఫ్ లో చాలా కీలకంగా నిలవనుంది. ఊరికొచ్చిన ఒక పెద్ద సమస్య కోసం ఆయన చేసే యుద్ధమే పెద్దిని రకరకాల ఆటల బరిలో దిగేలా చేస్తుంది. తండ్రి కోసం కొడుకు ఏం చేశాడనే పాయింట్ తో పాటు అసలు అంతమంది ఊరోళ్ళ కోసం వీళ్ళిద్దరూ ఎందుకు అంత పోరాటం చేశారనేది పెద్దికి సంబంధించిన ముఖ్యమైన స్టోరీ డ్రైవ్.
కేవలం కమర్షియల్ అంశాల మీదే దృష్టి పెట్టకుండా భావోద్వేగాలకు తగినంత చోటు ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు పెద్దిని తీసిన విధానం ఖచ్చితంగా అవార్డులు తెచ్చి పెడుతుందనే ధీమా క్యాస్టింగ్ తో పాటు సాంకేతిక నిపుణుల్లోనూ కనిపిస్తోంది. లుక్ పరంగా చాలా షాకింగ్ మేకోవర్ కు వెళ్ళిపోయిన జగపతిబాబు ఈసారి అప్పలసూరిగా అదరగొట్టడం ఖాయమని ఇన్ సైడ్ టాక్. రంగస్థలంలో నెగటివ్ క్యారెక్టర్ అయితే జగపతిబాబు ఇందులో పూర్తి పాజిటివ్ ఫాదర్ గా కనిపించేనున్నారు
Gulte Telugu Telugu Political and Movie News Updates