పెద్ది ప్రమోషన్లలో భాగంగా కెమెరామెన్ రత్నవేలు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆంజనేయుడిని తలపించే ఒక ఎపిసోడ్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఆ సన్నివేశంలో పెద్ది బదులు హనుమంతుడిని చూస్తారని, అక్కడ అభిమానులకే కాదు సగటు ప్రేక్షకులకు కూడా గూస్ బంప్స్ రావడం ఖాయమనే రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. ఏ సందర్భంలో వస్తుంది, కథ ఏంటనే ముఖ్యమైన డీటెయిల్స్ ఇవ్వలేదు కానీ దానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే ఉన్నాయి.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం పెద్ది పెహల్వాన్ గా కుస్తీ పోటీలో ఉన్నప్పుడు ఇంకో చోట జరిగిన సంఘటన వల్ల అత్యవసరంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తుంది. ట్రైలర్ లో చూపించే సైకిల్ షాట్ ఇదే. ఈ క్రమంలో జరిగే పరిణామాలు, తర్వాత వచ్చే ఫైట్, లంకను తగలబెట్టిన హనుమంతుడి రేంజ్ లో దర్శకుడు బుచ్చిబాబు ఈ మొత్తాన్ని డిజైన్ చేశారట. అది ఎలా జరుగుతుంది, ఎవరు కవ్వించారు, స్టేషన్ కు ఎందుకు వెళ్ళాడు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.
రత్నవేలు చెప్పిన ప్రకారం చరణ్ కెరీర్ లో రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తర్వాత పెర్ఫార్మన్స్ పరంగా పెద్దినే టాప్ 1లో నిలబడేలా ఉంది. ప్రమోషన్స్ గురించి మెగా ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ మొదటి షో కాగానే వాళ్ళే ఆనందంతో డాన్సులు చేస్తారని రషెస్ చూసిన వాళ్ళ నుంచి వినిపిస్తున్న మాట. సెన్సార్ నుంచి కూడా ప్రశంసలు దక్కాయని, ఇంత హార్డ్ హిట్టింగ్ స్పోర్ట్స్ డ్రామా ఈ మధ్య కాలంలో చూడలేదని కాంప్లిమెంట్స్ ఇచ్చారట.
కేవలం కమర్షియల్ లెక్కల పరంగానే కాదు పెద్ది అన్ని రకాలుగా రామ్ చరణ్ కు సవాల్ గా నిలుస్తోంది. ఎందుకంటే గేమ్ ఛేంజర్ చేసిన గాయం చిన్నది కాదు. ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ లాంటి విజయం చూసిన తర్వాత ఆచార్యతో పాటు దీని రూపంలో డిజాస్టర్లు పడటం జీర్ణించుకోలేకపోయారు. అందుకే పెద్ది మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నారు. ఓవర్సీస్ లో ఇంకా మిలియన్ అందుకోనప్పటికీ ప్రీమియర్లు పడే టైంకి ఆ లాంఛనం అయిపోతుందని ట్రేడ్ టాక్.
This post was last modified on May 27, 2026 2:48 pm
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…
స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మారడం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావడం అరుదు. ఐతే సినీ…
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…