Movie News

సమంతకు బంగారం లాంటి భర్త దొరికాడు

హీరోయిన్లు తమ కెరీర్లో ఎంత పీక్ చూసినా సరే.. ఒక దశ దాటాక డౌన్ అవ్వాల్సిందే. వాళ్లకు వయసు మీద పడి, గ్లామర్ తగ్గితే కెరీర్ ముందుకు సాగడం కష్టమవుతుంది. ఒకసారి మార్కెట్ పడిందంటే.. అవకాశాలు తగ్గి, కెరీర్లో గ్యాప్ వచ్చిందంటే మళ్లీ పుంజుకోవడం కష్టమవుతుంది.

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగి, తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పించిన సమంతకు కొన్నేళ్ల నుంచి అస్సలు కలిసి రావడం లేదు. పెళ్లి విఫలమవడం, అనారోగ్య సమస్యలకు తోడు.. శాకుంతలం సినిమా డిజాస్టర్ కావడం, ఆ తర్వాత కెరీర్లో గ్యాప్ రావడంతో తన పనైపోయిందని అందరూ ఒక అభిప్రాయానికి వచ్చేశారు.

‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను అనౌన్స్ చేసినా ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. చివరగా ‘అన్నీ మంచి శకునములే’ లాంటి డిజాస్టర్ తీసిన నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకురాలు అని తెలియడంతో ఎగ్జైట్మెంట్ కనిపించలేదు. పైగా ఈ సినిమా రిలీజ్ బాగా ఆలస్యం కావడంతో ఆసక్తి మరింత తగ్గింది.

కానీ జూన్ 19కి రిలీజ్ డేట్ ఖాయం చేసుకున్న టీం.. తాజాగా ట్రైలర్ లాంచ్ చేసింది. ఈ ప్రోమో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ రాగానే సినిమా మీద అభిప్రాయం మారిపోయింది. నిన్న తన భర్త, ఈ చిత్రానికి తెర వెనుక అన్నీ తానై వ్యవహరించిన దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత పాల్గొంది. ట్రైలర్ లాగే ఈ ఈవెంట్ కూడా సూపర్ సక్సెస్ అయింది.

రాజ్‌తో సమంత కెమిస్ట్రీ, తమది తిరుపతి అని చెబుతూ అచ్చ తెలుగులో మాట్లాడ్డమే కాక, సినిమాలో సమంతతో తమ ఊరి భాషే మాట్లాడించానని రాజ్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ఇక ట్రైలర్ చూస్తే.. రాజ్, డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ఫ్యామిలీ స్టార్’ ఛాయలు కనిపించాయి.

అందులో మాదిరే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ మిక్స్ చేసి చాలా ఎంటర్టైనింగ్‌గా ఈ సినిమా తీసినట్లున్నారు. దీనికి దర్శకురాలు నందిని అయినా అడుగడుగునా రాజ్ ముద్ర కనిపించింది. పెళ్లి తర్వాత తన భార్య నటించిన తొలి చిత్రానికి పెట్టుబడి పెట్టడమే కాక.. క్రియేటివ్‌గా, ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు రాజ్.

నిజానికి రాజ్‌కు బాలీవుడ్లో ఉన్న డిమాండ్‌కు ఇలాంటి ఒక చిన్న సినిమా కోసం ఇంత చేయాల్సిన అవసరం లేదు. కానీ భార్య కోసం అతను నిలబడ్డాడు. ఒక దశలో సమంత ఎదుర్కొన్న కష్టాలు చూసి చాలా ఫీలైన తన అభిమానులు.. ఇలా తన కెరీర్‌కు పూర్తి మద్దతునిచ్చే భర్త దొరకడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో సమంతకు ‘బంగారం’ అని టైటిల్ ఇచ్చారు కానీ.. అసలైన బంగారం రాజ్‌యే అంటూ కొనియాడుతున్నారు.

This post was last modified on May 26, 2026 7:16 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

1 hour ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago