వింత నాట్యంతో భయపెట్టిన ‘లైగర్’ భామ

సాధారణ మూవీ లవర్స్ ఏమో కానీ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోలేని డిజాస్టర్ లైగర్. కంటెంట్ పరంగానే కాదు ప్రమోషన్లతోనూ ట్రోలింగ్ కు గురైన మూవీగా ఇది బాగా గుర్తుండిపోయింది. హీరోయిన్ అనన్య పాండే లైగర్ కు ఎంత మైనస్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. తండ్రి సీనియర్ నటుడనే బ్యాక్ గ్రౌండ్ తో నెట్టుకొస్తున్న ఈ భామ యాక్టింగ్ మీద కంప్లైంట్స్ చాలానే ఉన్నాయి. అంతో ఇంతో కేసరి చాప్టర్ 2లో నటిస్తే ఆశించిన గుర్తింపు రాలేదు.

ఇదిలా ఉండగా అనన్య పాండే నటించిన కొత్త మూవీ చాంద్ మేరా దిల్ ఇటీవలే విడుదలయ్యింది. ఈ మధ్య బాలీవుడ్ లో లవ్ స్టోరీస్ ట్రెండ్ బాగా నడుస్తోంది కదా అదే కోవలో దీనికీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇందులో ఒక ఎపిసోడ్ లో అనన్య భరత నాట్యం చేస్తుంది. హీరో తన్మయత్వంలో చూస్తుంటాడు. అది సరదా కోసం తీసిన సన్నివేశమే అయినప్పటికి అనన్య గెంతులు మరీ విచిత్రంగా అనిపించి సోషల్ మీడియాలో నెగటివిటీని తెచ్చి పెట్టాయి.

కొందరు ఏకంగా ప్రాచీన నాట్య కళను నవ్వుల పాలు చేస్తోందంటూ దుమ్మెత్తి పోతున్నారు. నిజానికి అనన్య పాండే ఆ సీన్ లో డాన్స్ తో పాటు విచిత్రమైన యాక్షన్ చేసింది. దర్శకుడు వివేక్ సోని ఈ విషయంలో విమర్శలకు గురవుతున్నాడు. ‘కిల్’తో బ్లాక్ బస్టర్ కొట్టిన లక్ష్య లాల్వాని రెండేళ్లు గ్యాప్ తీసుకుని చాంద్ మేరా దిల్ లో హీరోగా నటించాడు. రివ్యూలు యావరేజ్ రాగా వీకెండ్ కల్లెక్షన్లు పదిహేను కోట్లు కూడా దాటలేదు. మెల్లగా పికప్ అవుతుందని టీమ్ ధీమాగా ఉంది.

ఇప్పుడీ క్లిప్ పుణ్యమాని చాంద్ మేరా దిల్ మీద అటెన్షన్ వస్తోంది. కాలేజీలోనే ప్రేమించుకున్న ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ షిప్ లోకి వెళ్ళాక కొత్త సమస్యలు వస్తాయి. ఆ ఛాలెంజులని ఈ యువ జంట ఎలా ఎదురుకుందనేది అసలు స్టోరీ. ఇదేదో ఆషామాషీ ప్రొడక్షన్ హౌస్ తీసింది కాదు. ధర్మా బ్యానర్ భాగస్వామ్యంతో కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే చాంద్ మేరా దిల్ కథా నేపధ్యం హైదరాబాద్ లోనే జరుగుతుంది. అదీ సర్ప్రైజ్.