కల్కి, సలార్ లాంటి భారీ విజయాలు ఖాతాలో ఉన్నా కూడా, ప్రభాస్ వాటి సీక్వెల్స్ ను హోల్డ్ లో పెట్టి ముందుగా రెండు సరికొత్త కథల మీద ఫోకస్ చేయడం ఇప్పుడు డిఫరెంట్ స్ట్రాటజీ అనే చెప్పాలి. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఒక భారీ పోలీస్ స్టేషన్ సెట్ లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తో పాటు ప్రభాస్ మీద కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ స్పిరిట్ షూట్ ఒక కొలిక్కి రాగానే ప్రభాస్ నేరుగా ఫౌజీ సెట్స్ లో అడుగుపెట్టేలా ప్లాన్ చేసుకున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్ లో రాబోతున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామాలో సైనికుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఒకేసారి డార్క్ యాక్షన్ రోల్స్ చేయకుండా, మధ్యలో ఒక మంచి ఎమోషనల్ స్టోరీని సెట్ చేసుకోవడం. దీనివల్ల ప్రేక్షకులకు ఒకే రకమైన యాక్షన్ ఫీల్ కలగకుండా వేరియేషన్ చూపించే ఛాన్స్ దొరుకుతుంది.
మారుతితో రాజాసాబ్ తేడా కొట్టినా ప్రభాస్ మాత్రం ఒకే దారిలో వెళ్లకూడదని గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కమర్షియల్ గా కూడా ఒకే జానర్ కు ఫిక్స్ అవ్వకుండా మార్కెట్ ను బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు ప్రభాస్ ఈ రెండు కొత్త ప్రాజెక్టుల తర్వాతే కల్కి 2, సలార్ 2 ఎందుకు మొదలుపెట్టాలి అనుకుంటున్నాడు అనే దాని వెనుక ఒక బలమైన బిజినెస్ లాజిక్ కనిపిస్తోంది. సీక్వెల్స్ మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అవుట్ పుట్ రావాలంటే దర్శకులు ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లకు చాలా సమయం కావాలి.
ప్రీ ప్రొడక్షన్ తో పాటు విఎఫ్ఎక్స్ వర్క్స్ పక్కాగా జరగడానికి ఈ గ్యాప్ కరెక్ట్ గా సరిపోతుంది. పైగా ఆ ఫ్రాంచైజీల మీద జనాలు ఎంత ఎక్కువ వెయిట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఆ క్యూరియాసిటీ అంతలా పెరుగుతుంది. ఈ స్ట్రాటజీ వెనుక మరో ప్రాక్టికల్ కారణం కూడా ఉంది. అదే హీరో ఫిజికల్ మేకోవర్.
స్పిరిట్ లో పోలీస్ గా, ఫౌజీలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించాలంటే చాలా స్లిమ్ గా, ఫిట్ గా, డిసిప్లిన్డ్ బాడీ లాంగ్వేజ్ తో ఉండాలి. అదే సలార్ లో దేవా క్యారెక్టర్ కు, కల్కిలో భైరవ పాత్రకు కాస్త బల్కీగా, రఫ్ గా కనిపించాల్సి ఉంటుంది. అందుకే ఈ రెండు ఫిట్ రోల్స్ ను ఒకేసారి కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఆ భారీ దేహంతో సీక్వెల్స్ కు ఈజీగా షిఫ్ట్ అవ్వొచ్చు అనే ఒక పక్కా క్లారిటీతో డార్లింగ్ అడుగులు వేస్తున్నట్లు అర్ధమవుతుంది.
This post was last modified on May 22, 2026 3:48 pm
మన దగ్గర తెరమీద కనిపించడం మానేసింది కానీ బాలీవుడ్ ఆఫర్లతో మిల్కి బ్యూటీ తమన్నా కెరీర్ దివ్యంగానే ఉంది. సినిమాలు,…
తాజాగా విడుదలైన ది ప్యారడైజ్ మీద చర్చలు, ట్రోల్స్, కలెక్షన్ల మీద డిబేట్లు అన్నీ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి.…
సెలబ్రిటీలు సోషల్ మీడియాకు స్పందించే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ మాత్రం టెంప్ట్ అయినా దాని పరిణామాలు అనవసరమైన అపార్థాలకు…
దగ్గరదగ్గర పది.. పన్నెండు రోజుల క్రితం ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్ పింగ్…
మీ ఆవిడ ఏమి చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే హౌస్ వైఫ్ అని సమాధానం చెప్పడం ఇప్పటి వరకు మనం…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ ఊహించని స్థాయిలో అతి పెద్ద ఓపెనింగ్ దక్కించుకుంది. నిర్మాణ సంస్థ అధికారికంగా చెబుతున్న దాని…