రజనీకాంత్ ‘జైలర్ 2’ సెప్టెంబర్ 4న రిలీజ్‌కు రెడీ అవుతోందనే న్యూస్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. షూటింగ్ పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ ఈ సినిమా వెనుక ఉన్న అసలు విశేషం రిలీజ్ డేట్ కాదు, రజనీ తన కెరీర్‌లో ఎప్పుడూ పాటించిన ఒక స్ట్రాంగ్ రూల్‌ను బ్రేక్ చేయడమే. అదే సీక్వెల్ సెంటిమెంట్.
రజనీకాంత్‌కు సీక్వెల్స్ అంటే మొదటి నుంచి నమ్మకం తక్కువ. రోబో తర్వాత 2.0 వచ్చినా, పార్ట్ 1 సృష్టించిన ఇంపాక్ట్‌ను అది అందుకోలేకపోయింది. అంతకుముందు చంద్రముఖి 2 ఆఫర్ రజనీ వద్దకు వస్తే, పార్ట్ 1 మ్యాజిక్‌ను మళ్లీ క్రియేట్ చేయడం కష్టం, జనం ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు.. అని ఆయన సున్నితంగా తిరస్కరించారు. బాషా 2, పడయప్ప 2 లాంటి కథలు కూడా చర్చల దశలోనే ఆగిపోయాయి. అలాంటి రజనీ జైలర్ 2కి మాత్రం ఎందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీనికి ఒకే ఒక సమాధానం దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. బీస్ట్ ఫ్లాప్ తర్వాత ఇండస్ట్రీ మొత్తం నెల్సన్‌ను పక్కన పెడితే, రజనీ మాత్రం ఆయనను నమ్మి ‘జైలర్’ ఛాన్స్ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నెల్సన్ నిజం చేశాడు. అందుకే పార్ట్ 2 కథ వినగానే రజనీ ఆలోచించకుండా ఓకే చెప్పేశారు. కానీ ఇది పూర్తి స్థాయి సీక్వెల్ కాదు. కథ మొత్తం ‘టైగర్ ముథువేల్ పాండియన్’ పాస్ట్ చుట్టూ, ఆయన ఎమోషనల్ జర్నీ చుట్టూ తిరుగుతుంది.
సెప్టెంబర్ 4 గురువారం రిలీజ్ అంటే, మరుసటి వారం వినాయక చవితి లాంగ్ వీకెండ్ల అడ్వాంటేజ్ ఉంటుంది. SJ సూర్య ఫుల్ లెంగ్త్ విలన్‌గా, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ క్యామియోలతో ‘జైలర్ 2’ ఇప్పటికే పాన్ ఇండియా బజ్ క్రియేట్ చేసింది. రూల్‌ను ఆల్రెడీ బ్రేక్ చేసి సినిమా తీసేసిన రజనీ, ఈ రిస్క్‌తో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు బ్రేక్ చేస్తారా అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates