ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18 ముంబైలో ట్రైలర్ లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. భోపాల్ లో ఐటెం సాంగ్ లాంచ్ తో పాటు ఏఆర్ రెహమాన్ లైవ్ కన్సర్ట్ ప్లానింగ్ లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏం చేస్తారనే నిర్ణయం ఇంకా ఫైనల్ కాలేదు. రామ్ చరణ్ హైదరాబాద్ వచ్చేశాడు కాబట్టి దానికి సంబంధించిన చర్చలు, డేట్లు లాక్ చేసుకోవడం లాంటి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఇందులో పాత్రల గురించి పెద్దగా హింట్స్ ఇవ్వకుండా కేవలం పోస్టర్లతో సరిపెట్టిన దర్శకుడు బుచ్చిబాబు సినిమాలో మాత్రం బోలెడు సర్ప్రైజులు చూపిస్తాడని ఇన్ సైడ్ టాక్. వాటి ప్రకారం జగపతిబాబు పోషించిన అప్పాల సూరి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో చాలా కీలకంగా ఉంటుందట. రామ్ చరణ్ పెద్ది పాత్రని డ్రైవ్ చేస్తూ ఇంటర్వెల్ కు ముందు హీరోకి లక్ష్యాన్ని ఏర్పరిచే విధానం చాలా ఎమోషనల్ గా వచ్చిందని అంటున్నారు. విశ్రాంతి ఫైట్ కు దారి తీసేది ఇదేనట.
పలు ఇంటర్వ్యూలలో జగపతిబాబు చెప్పినట్టు ఇది వన్ అఫ్ ది బెస్ట్ గా నిలవడం ఖాయం. రంగస్థలంలో ప్రెసిడెంటుగా ఫుల్ నెగటివ్ గా కనిపించిన జగ్గుభాయ్ ఈసారి రామ్ చరణ్ తండ్రిగా మంచి పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోవడం ఖాయమని, ఇంకా చెప్పాలంటే అవార్డు వచ్చే రేంజ్ లో నటించారట. కొన్నేళ్లుగా ఈయన్ని ఒకే తరహా విలన్ గా చూసి బోర్ కొట్టిన ఆడియన్స్ కి కొత్త అనుభూతి ఇవ్వడం ఖాయమనే స్థాయిలో ఉందని రషెస్ చూసిన వాళ్ళ ఫీడ్ బ్యాక్.
ఇదంతా బాగానే ఉంది కానీ పెద్ది మేల్కొనే టైం అయితే వచ్చేసింది. పబ్లిసిటీని పరుగులు పెట్టించాలి. సోషల్ మీడియా అభిమానులు వృద్ధి సంస్థ మార్కెటింగ్ పట్ల ఏ మాత్రం సంతృప్తికరంగా లేరు. సినిమా అదిరిపోయి ఉండొచ్చు కానీ ఇండియా వైడ్ జనాలకు రీచ్ కావాలంటే గట్టిగా సౌండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చివరి రెండు వారాలు ఉధృతంగా ప్రచారం చేసేందుకు మైత్రి టీమ్ రెడీ అయ్యిందని సమాచారం. జూన్ 3 ప్రీమియర్లతో పెద్ది మన ప్రపంచంలోకి అడుగు పెట్టనున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates