సినిమా జాతకాన్ని ఎన్నికలు మార్చేశాయి

మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ బయటికి వచ్చినప్పుడు అభిమానులు తల్లడిల్లిపోయారు. ఎన్నికల సమయం కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు కానీ నిర్మాతలు రంగంలోకి దిగి వీలైనంత కట్టడి చేసే నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. జనవరిలో 120 కోట్లు పలికిన ఓటిటి డీల్ కొద్దిరోజుల క్రితం 50 కోట్లకు పడిపోయిందనే ప్రచారం మీడియా వర్గాల్లో జోరుగా తిరిగింది.

కట్ చేస్తే జన నాయకుడుకి ఇప్పుడు అమాంతం డిమాండ్ పెరిగిందని ట్రేడ్ టాక్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమాగా దీనికి స్పెషల్ పబ్లిసిటీ లభించనుంది. ఎందుకంటే ఇకపై విజయ్ మేకప్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి బిగ్ స్క్రీన్ మీద సెలెబ్రేట్ చేసుకోవడానికి ఇదొక్కటే మంచి అవకాశం. ఈసారి టీవీకే వర్గాలు, ఎమ్మెల్యేలు, ఫ్యాన్స్, సాధారణ ప్రజలు అందరూ కలిసి చెన్నై నుంచి కోయంబత్తూర్ దాకా ఓ రేంజ్ లో సంబరాలు చేసేలా ఉన్నారు.

ఈ పరిణామాల వల్ల ఓటిటి రేట్ మళ్ళీ పెరిగిందని టాక్. ఎంతనేది బయటికి రాలేదు కానీ ముందు వద్దనుకున్న కంపెనీలు ఇప్పుడు భారీ ఆఫర్ ఇస్తున్నాయట. థియేటర్ రన్ అయ్యాక అత్యధిక వ్యూస్ వచ్చే తమిళ మూవీగా ఇది రికార్డులు సృష్టించడం ఖాయమనే నమ్మకం వాళ్లకు వచ్చేసింది. తెలుగుతో పాటు ఇతర డబ్బింగ్ భాషల్లో అద్భుతాలు చేయకపోవచ్చు కానీ ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఊచకోత ఖాయమని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

ఇక మిగిలింది విడుదల తేదీని ఫైనల్ చేయడమే. మార్చ్ 27 అనే ప్రచారం డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ లో ఉంది కానీ ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ చేతికి రాలేదు. కొన్ని మార్పులు, కత్తిరింపులుతో ఈ వారంలో లాంఛనం అయిపోతుందని చెన్నై వర్గాలు ఉటంకిస్తున్నాయి. భగవంత్ కేసరి రీమేక్ గా రూపొందిన జన నాయకుడులో రాజకీయ అంశాలు గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో ఆశ్చర్యపరిచే సంఘటనలు పెట్టాడట దర్శకుడు వినోత్. చూడాలి ఎలాంటి స్పందన వస్తుందో.