సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు అనుకున్న రిలీజ్ జూలై నెలలో. కానీ ఇప్పుడు ఆగస్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు వస్తున్న వార్తలు అయోమయానికి దారి తీస్తున్నాయి. ఎందుకంటే ఇండిపెండెన్స్ డేకి తీవ్రమైన కాంపిటీషన్ ఉంది. రజనీకాంత్ జైలర్ 2 అటు ఇటు తిరిగి స్వాతంత్ర దినోత్సవానికి వస్తుందని చెన్నై వర్గాలు ఉటంకిస్తున్నాయి. మొదటి భాగం వచ్చింది ఆ నెలలోనే.
ఇక్కడితో అయిపోలేదు. అదే టైంలో సన్నీ డియోల్ లాహోర్ 1947 రిలీజ్ కానుంది. అమీర్ ఖాన్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కేవలం వారం గ్యాప్ లో నాని ది ప్యారడైజ్ వస్తుంది. ఈసారి వాయిదా పడే ప్రసక్తే లేదని హీరోతో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పట్టుదలతో ఉన్నారు. వీటి మధ్య సాఫ్ట్ జానర్ కు చెందిన విశ్వనాథ్ అండ్ సన్స్ ఎలా నెగ్గుకొస్తుందనేది అసలు ప్రశ్న. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన ఇవ్వలేదు కాబట్టి కన్ఫర్మ్ చేయలేం కానీ టాక్ అయితే ఉంది.
సూర్యకు ఈ ఏడాది ప్రత్యేకంగా నిలవనుంది. తక్కువ గ్యాప్ లో వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదల కాబోతున్నాయి. ఈ రెండు హిట్ అయితే కంబ్యాక్ అవ్వొచ్చనే నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు. అందుకే కోరి మరీ ధనుష్ కి సార్ రూపంలో హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరితో చేతులు కలిపాడు. సితార సంస్థ కావడంతో బడ్జెట్ పరంగా రాజీ లేకుండా షూటింగ్ అయిపోయింది. ఆ మధ్య టీజర్ వదిలారు కానీ ఇంకా ఆశించిన స్థాయిలో బజ్ పెరగాల్సి ఉంది.
ఇంకొద్దిరోజుల్లో వీటికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావొచ్చు. అయినా ఇలా ప్యాన్ ఇండియా మూవీస్ నుంచి మీడియం బడ్జెట్ తో రూపొందిన ఎమోషనల్ డ్రామాల వరకు అన్నీ వాయిదాల పర్వంలో నలిగితే థియేటర్లకు ఫీడింగ్ ఎక్కడి నుంచి వస్తుంది. పోస్ట్ పోన్లతో హీరోలకు సంబంధం ఉండదు కానీ నిర్మాతలు కూడా ఒక ప్లానింగ్ తో చెప్పిన డేట్ కి కట్టుబడి ఉంటే ఎన్నో సమస్యలు తీరతాయి. మమిత బైజు హీరోయిన్ గా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు జివి ప్రకాష్ సంగీతం అందించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates