నిన్న సాయిపల్లవి పుట్టినరోజు. అసలు విశేషం అది కాదు. రామాయణలో సీతగా నటించిన తనకు బర్త్ డే కానుకగా ఒక పోస్టర్ లేదా టీజర్ లాంటిది రిలీజ్ చేయలేదు. దీపావళి విడుదల ఉంటుందని నిర్మాత పదే పదే నొక్కి వక్కాణిస్తున్న నేపథ్యంలో కీలకమైన హీరోయిన్ కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఇవ్వాల్సిన సందర్భంలో ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న తలెత్తుతోంది. బాలీవుడ్ వర్గాల ప్రకారం ఆ కారణాల గురించి రకరకాల వెర్షన్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సాయిపల్లవి మీద నెగటివిటీ నడుస్తోంది. ఇటీవలే రిలీజైన ఏక్ దిన్ డిజాస్టర్ కావడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. అసలు జునైద్ ఖాన్ లాంటి కొత్త హీరో సరసన ఇంత నీరసమైన సినిమా ఎలా ఒప్పుకుందని తల పట్టుకున్నారు. దీనికి స్వయంగా నేను ఈ పాత్రకు సూట్ కానని ముందే అనుమానం వచ్చిందని సాయిపల్లవి చెప్పడం దీనికి మరింత ఆజ్యం పోసింది. ప్రీమియర్ షో ప్రెస్ మీట్ లో ఆమె ఇచ్చిన ఇంగ్లీష్ కం హిందీ స్పీచ్ మీద కొంత ట్రోలింగ్ కూడా జరిగింది.
ఇది పక్కనపెడితే ఆ మధ్య వచ్చిన రామాయణ టీజర్ కు యునానిమస్ రెస్పాన్స్ రాలేదు. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకున్న టీమ్ విఎఫ్ఎక్స్ మీద మరింత శ్రద్ధ పెట్టిందట. ఇలాంటి టైంలో మరో కంటెంట్ వదిలి విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆగిపోయారని ఒక టాక్ ఉంది. వీడియో కాకపోయినా సాయిపల్లవిది కనీసం ఒక పోస్టర్ వదిలి ఉండాల్సిందన్న మాటలో నిజాన్ని కాదనలేం.
దీపావళి పండగ నవంబర్ 8 వస్తుంది. సో రామాయణ పార్ట్ 1 రిలీజ్ డేట్ దాదాపు అదే కావొచ్చు. అంటే కేవలం ఆరు నెలలు మాత్రమే సమయం ఉంది. ఇందులోనే పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ, గ్రాఫిక్స్, సెన్సార్, ఆల్ ఇండియా ప్రమోషన్స్ అన్నీ చూసుకోవాలి. నిజంగానే డెడ్ లైన్ ని చేరుకోగలరా లేదానే అనుమానాలు ట్రేడ్ వర్గాల్లో లేకపోలేదు. నాలుగు వేల కోట్లతో తీశామని నిర్మాత నమిత్ మల్హోత్రా చెబుతున్న నేపథ్యంలో ప్రతి విషయంలోనూ అంచనాలు పీక్స్ లో ఉండబోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates