వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం కాదిది. వాళ్ళను ఏ రకంగా ఆకట్టుకోవాలో గుర్తించి రకరకాల గిమ్మిక్కులు చేయాలి. నిత్యం సోషల్ మీడియాలో ఉండేలా కంటెంట్ సృష్టించాలి. ఇన్ఫ్లూ యెన్సర్లు, మీమర్స్ సహాయంతో ట్విట్టర్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో వైరల్ అయ్యేలా చేసుకోవాలి. ఎలాగూ రెగ్యులర్ గా చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు ఉండనే ఉన్నాయి.
ఇదంతా చూడచక్కగా ఉంది కానీ నిజానికి ఇవి ఏ మేరకు ఫలితం ఇస్తున్నాయంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే సదరు చిత్రాలు తీసిన దర్శకులు పబ్లిసిటీలో చూపిస్తున్న క్రియేటివిటీ ఏదైతే ఉందో అందులో సగం స్క్రిప్ట్ మీద చూపించినా సూపర్ హిట్ కొట్టేయొచ్చనే కామెంట్స్ జనంలో నుంచే వినిపిస్తున్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్నది వేరు. మండే వస్తే చాలు మరణశాసనం అన్నట్టు తయారయ్యింది బాక్సాఫీస్ పరిస్థితి.
ఒకాయనేమో ఫిలిం మేకింగ్, లేటెస్ట్ టెక్నాలజీ గురించి బోలెడు పాఠాలు చెబుతారు. అయిదేళ్లలో కనీసం ఒక్క సినిమా బాలేదంటారు. తీరా చూస్తే తన ఫస్ట్ డే ఫస్ట్ షోలో పది మంది కూడా జనం లేక షోలు క్యాన్సిల్ అవుతాయి. ఇంకో యూత్ హీరో మా సినిమా చూడండి కూలర్లు ఏసిలు అవసరం లేదంటాడు. కానీ అసలు బొమ్మకు అంత సీన్ లేదనే మాటలు బాహాటంగానే వినిపిస్తాయి. స్టార్ హీరో ఇంటి కోడలు నటించిన మరో మూవీని అసలా ఫ్యామిలీ మొత్తమైనా చూశారో లేదో డౌటే.
ఇదేదో వ్యంగ్యంగా అంటున్నది కాదు. వాస్తవం చేదుగానే ఉంటుంది. ఇప్పుడే కాదు నిన్న వారం, అటుమొన్న వారం ఇలాంటి హంగులు, పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చిన చిన్న సినిమాలు చాలా ఉన్నాయి. ఏవీ కనీసం యావరేజ్ అనిపించుకోలేకపోయాయి. ఒకపక్క చూస్తే రీ రిలీజులకు జనాలు ఎగబడుతుంటే కొత్తవి కన్నీరు పెట్టుకునే దుస్థితి తలెత్తుతోంది. ఈ ధోరణిలో మార్పు వచ్చి ఇకనైనా క్వాలిటీ కంటెంట్ మీద దృష్టి పెట్టకపోతే చిన్న సినిమాలకు మరింత గడ్డుకాలం స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉంది.
This post was last modified on May 9, 2026 10:56 pm
ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ…
రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…
ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…
వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతం.. మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ అనేక మంది పేదలు.. దిగువ…