అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ కథనర్ ది వైల్డ్ సార్సరర్. ఇది మల్లువుడ్ డెబ్యూ కూడా. జయసూర్య హీరోగా నటించాడు. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం జరిగిన తొమ్మిదో శతాబ్దపు వీరుడి కథను తీసుకున్నారు. నిర్మాణం రెండు సంవత్సరాలకు పైగానే జరిగింది. టీజర్ వచ్చి నెల దాటేసింది. 4 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి.
అనుష్కని చూపించి చూపించకుండా కేవలం ఒక్క షాట్ కి పరిమితం చేసి నిరాశ పరిచినా ఇందులో స్వీటీ చేసింది చాలా ముఖ్యమైన పాత్ర. స్టంట్స్ తో పాటు అడ్వెంచర్లు కూడా చేయించారట దర్శకుడు రోజిన్ థామస్. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ కథనర్ విడుదల ఎప్పుడనేది ప్రశ్నగా మిగిలింది. విఎఫ్ఎక్స్ వల్ల లేట్ అవుతోందని అంటున్నారు. కానీ ఓటిటి డీల్ ఇంకా ఆశించినంత స్థాయిలో లేకపోవడం వల్లే వాయిదా పడిందనే వెర్షన్ వినిపిస్తోంది.
ఎంత గ్రాండియర్ ఉన్నా కథనర్ కు ఇతర భాషల్లో బజ్ లేదు. కేవలం అనుష్క ఉందన్న కారణంగా ప్రేక్షకులు ఎగబడి చూడరు. అలా అయితే ఘాటీ అంత దారుణంగా బోల్తా కొట్టేది కాదు. సో హైప్ రావాలంటే ఇంకేదో చేయాలి. టీజర్ చూస్తేనేమో అర్థమే కానట్టు కట్ చేశారు. అసలే మలయాళీ పీరియాడిక్ డ్రామాలు మనకు కనెక్ట్ కావు. గతంలో మోహన్ లాల్ రెండు మూడు ప్యాన్ ఇండియా సినిమాలు మన దగ్గర ఈ కారణంగానే పట్టుమని రెండు రోజులు ఆడలేదు.
సో కథనర్ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. ఇది రెండు భాగాలుగా వస్తోందట. ఈ ఏడాది వేసవి నుంచి దీపావళి దాకా కీలకమైన రిలీజ్ డేట్లు ఒక్కొకటిగా లాక్ అవుతున్నాయి. పెద్ది, ప్యారడైజ్, రామాయణతో పాటు టాక్సిక్ లాంటివి మంచి సీజన్స్ లో వస్తున్నాయి. వీటి మధ్య కథానార్ తట్టుకోవడం అంత సులభం కాదు. అన్నట్టు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరిగింది ఎప్పుడో తెలుసా. 2021 సంవత్సరంలో. 2023 లో షూట్ స్టార్ట్ అయ్యింది. అంటే ఆరు సంవత్సరాలు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టారన్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates