ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప చిత్రం తీశామని, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫిదా అయిపోతారని తెగ నమ్మకంగా చెప్పుకుంటూ వచ్చారు. తీరా చూస్తే నాలుగో రోజుకు బొమ్మ తిరగబడింది. జనాలకు సినిమా రీచ్ కాలేదు. థియేటర్ వెళ్లిన వాళ్లకు చెప్పినంత లేదనే నిరాశ పబ్లిక్ టాక్ గా బయటికి వచ్చింది. కట్ చేస్తే ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం ఖాతాలో ఫ్లాప్ పడింది.
నాన్ థియేటర్ డీల్స్ లో తను సేఫ్ అయ్యుండొచ్చు కానీ పబ్లిక్ తీర్పులో అది హిట్ కిందకు రాదు. సరే ఈ ప్రాజెక్టు ప్రభావం కిరణ్ త్వరలో దర్శకత్వం చేయబోయే సినిమా మీద ఉంటుందేమోనని ఫ్యాన్స్ అనుమానపడ్డారు. కానీ కిరణ్ వెనకడుగు వేయడం లేదు. రిస్క్ అయినా సరే ముందుకు వెళ్తున్నాడు. రియాలిటీ పేరుతో తీయబోయే మూవీని మే చివరి వారం నుంచి మొదలుపెట్టబోతున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతంలో ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.
నిజానికి ఇప్పటి జనరేషన్ హీరోలు దర్శకత్వం జోలికి వెళ్లడం లేదు. సిద్ధూ జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి లాంటి యంగ్ టాలెంట్స్ రచనలో సహాయం చేస్తున్నప్పటికీ మెగా ఫోన్ పట్టుకోలేదు. వాళ్ళ దాకా ఎందుకు చిరంజీవి తరంలోని నలుగురు సీనియర్లు, ఇప్పటి టయర్ 1 స్టార్లు ఎవరూ ఈ ఆలోచన చేయడం లేదు. ఎప్పుడో జానీ కొట్టిన దెబ్బకు పవన్ కళ్యాణ్ మళ్ళీ యాక్షన్ కెమెరా అనే సాహసం చేయలేదు. అందుకే కిరణ్ ది రిస్క్ గా భావిస్తున్నారు.
నిజ జీవిత సంఘటనలు, మనుషుల ఆధారంగా రూపొందుతున్న రియాలిటీలో క్యాస్టింగ్ తదితరాలు ఇంకో వారం పది రోజుల్లో ప్రకటించబోతున్నారు. ఎస్ఆర్ కళ్యాణమండపంలో రచయితగా తన ముద్ర చూపించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు డైరెక్టర్ గా ఎలాంటి ఇంప్రెషన్ తెచ్చుకుంటాడో చూడాలి. విశ్వక్ సేన్ మాత్రమే కిరణ్ ఏజ్ హీరోల్లో డైరెక్టర్ గా ఉన్నాడు. ప్రస్తుతం తను కల్ట్ అనే వయొలెంట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది, రియాలిటీ రెండూ ఈ ఏడాదే విడుదల కాబోతున్నాయి.
This post was last modified on May 8, 2026 6:41 pm
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…