ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవడం సవాలుగా మారింది. తెలుగులో రూపొందే పెద్ద సినిమాలకు ఇక్కడ పబ్లిసిటీ, రిలీజ్ విషయంలో పెద్ద ఇబ్బందులేమీ ఉండవు కానీ..పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్నపుడు అది పెద్ద టాస్కే. ముందు ఆ సినిమాపై ఇతర భాషల వాళ్లలో క్యూరియాసిటీ పెరిగేలా ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వాలి.
సినిమాకు బజ్ క్రియేట్ చేశాక.. రిలీజ్ గట్టిగా ఉండేలా ఉండేలా చూసుకోవాలి. రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది మొదలైనపుడు నాన్ తెలుగు ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు కానీ.. దీని టీజర్, చికిరి చికిరి పాట మ్యాజిక్ చేయడంతో ఇండియా వైడ్ మూవీకి క్రేజ్ వచ్చింది. నార్త్ వాళ్లు కూడా ఈ టీజర్, ఆ పాట చూసి ఊగిపోయారు. ఇక మిగిలిన టాస్కల్లా సినిమాకు బిగ్ రిలీజ్ ఉండేలా చూసుకోవడమే. ఈ పని జియో స్టూడియోస్ చూసుకుంటోంది.
జూన్ 4న పెద్ది రిలీజ్ కానుండగా.. ఆ తర్వాతి రోజే వరుణ్ ధావన్ చిత్రం హై జవానీ తో ఇష్క్ హోనా హై రిలీజ్ అవుతోంది. ఇందులో మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. ఒక సౌత్ మూవీ, ఒక బాలీవుడ్ మూవీ పోటీలో ఉంటే.. సాధారణంగా హిందీ చిత్రానికే థియేటర్ల కేటాయింపులో ప్రయారిటీ ఉంటుంది.
కానీ వరుణ్ సినిమాకు దీటుగా… పెద్దికి స్క్రీన్లు ఇప్పించుకునే బాధ్యత జియో స్టూడియోస్ తీసుకుంది. ఈ సంస్థ ఇటీవలే విడుదలైన రాజా శివాజి చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆ సినిమా కోసం తీసుకున్న స్క్రీన్లన్నింటినీ అలాగే అట్టిపెట్టుకుని వాటిలోనే పెద్ది చిత్రాన్ని వేయబోతోంది.
రాజా శివాజి నెల రోజులకు మించి ఆడే అవకాశం కనిపించడం లేదు. జియో వాళ్ల సినిమా అంటే నార్త్ ఇండియాలో పబ్లిసిటీ కూడా గట్టిగా జరుగుతుంది. రిలీజ్ ప్లానింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. రాజా శివాజి విషయంలోనూ వారి ప్లానింగ్ స్పష్టంగా కనిపించింది.
కాబట్టి పెద్ది నార్త్ ఇండియా రిలీజ్ విషయంలో టీంకు ఏ టెన్షన్ లేనట్లే. కావాల్సిందల్లా సమయానికి ఫస్ట్ కాపీ రెడీ చేసి ఇవ్వడమే. ఇక సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. పుష్ప తరహాలో ఇది కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఛాన్సుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates